»   » చూస్తున్నారా? ‌: ఈ రోజే మీ ఇంట్లో ‘బాహుబలి’

చూస్తున్నారా? ‌: ఈ రోజే మీ ఇంట్లో ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు సాధించింది.ఈ చిత్రం ఈ శనివారం మా టీవి లో ప్రీమియర్ షోగా వేస్తున్నారు. ఆ మేరకు బాహుబలి టీమ్ తన ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తోంది.


దాంతో మిగతా ఛానెల్స్ అన్నీ ఆ రోజు తమ టీఆర్పీలకు ఓ రేంజిలో దెబ్బ తగులుతుందనే భావిస్తున్నాయి. ఈ మేరకు మాటీవి తమ చిత్రం ప్రోమోతో టీజర్ వదిలింది.


Biggest Block Buster #Baahubali World Television Premiere ..This Saturday (24th) at 6 PM on Maa TV .. #BaahubaliOnMAATV


Posted by Maa TV on 21 October 2015

'బాహుబలి' విషయానికి వస్తే..


భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.


Premiere of Baahubali: The Beginning on MAA T.V. today

చిత్రం విడుదలై మొన్నటితోతో 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.


Premiere of Baahubali: The Beginning on MAA T.V. today

బాహుబలి'ని స్పెయిన్‌లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పెయిన్‌లో జరుగుతున్న సిట్‌గీస్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా 'బాహుబలి ది బిగినింగ్‌' చిత్రాన్ని ప్రదర్శించారు.


English summary
The Telugu television premiere of "Baahubali: The Beginning" on MAA T.V. today at 6pm., in Hindi it will be aired on Oct, 25th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu