Bigg Boss Voting : తారుమారైన ఓటింగ్ , ఫినాలేకు ముందు k బ్యాచ్‌కి షాక్? .. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?
బిగ్‌బాస్ తెలుగు 8కి మరికొద్దిరోజుల్లో ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 14వ వారంలో అడుగుపెట్టగా.. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ వారంతో బిగ్‌బాస్ తెలుగు 8 విజేత ఎవరో తేలిపోనుంది . ఇక ఈ వారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో పరిశీలిస్తే.
ప్రస్తుతం హౌస్‌లో ఉండి తాను ఇచ్చిన టాస్క్‌లలో గెలిచిన కంటెస్టెంట్స్‌కి ఓట్లు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాడు బిగ్‌బాస్ . ఇప్పటికే నబీల్, ప్రేరణలు తాము ఎందుకోసం బిగ్‌బాస్‌కి వచ్చామో, అసలు ఎందుకు మాకు సపోర్ట్‌గా నిలబడాలో చెబుతూ ప్రేక్షకులను ఓట్లు అభ్యర్ధించారు. గురువారం ఓటు అప్పీల్ చేసుకునేందుకు మూడో అవకాశాన్ని కల్పించేందుకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదే పవర్ ఫ్లాగ్. ఎవరైతే ఈ టాస్క్‌లో చివరి వరకు ఉంటారో అతను గెలిచి ఓట్ అప్పీల్ కంటెండర్‌గా నిలుస్తాడు.

అందరికీ గట్టి పోటీ ఇస్తూ గౌతమ్ వీర విహారం చేశాడు. అతని దెబ్బకి అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సైతం పక్కకి తప్పుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా గౌతమ్ చేతిలో నుంచి రోహిణి ఫ్లాగ్ లాక్కుని అతనిని పోటీలో నుంచి తప్పించింది. చివరికి ఈ టాస్క్‌లో రోహిణి - అవినాష్ మాత్రమే మిగిలారు. ఇందులో రోహిణిని గెలిపించడానికి అవినాష్ ఎంతో ప్రయత్నించగా ఆమె అతనిని హగ్ చేసుకుని కంటతడి పెట్టింది.
తర్వాత నిలబెట్టు.. పడగొట్టు అనే ఛాలెంజ్ విసిరాడు బిగ్‌బాస్. చివరి వరకు ఎవరైతే వేస్ట్ బాక్స్‌లో తమ ఫోటో పడకుండా జాగ్రత్త పడతారో వారే ఈ టాస్క్‌లో గెలిచినట్లు. ఈ రెండు టాస్క్‌ల్లో విష్ణుప్రియ, రోహిణిలు గెలవగా.. ఇంటి సభ్యులు విష్ణుని ఓట్ అప్పీల్ చేసుకునేందుకు సెలక్ట్ చేశారు. అనంతరం ఇన్ఫినిటీ రూమ్‌కి వెళ్లిన ఆమె బిగ్‌బాస్ తెలుగు టైటిల్‌ను గెలిచిన తొలి మహిళగా నిలవాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇక్కడి వరకు తనను తీసుకొచ్చినందుకు అందరికీ థాంక్స్ చెప్పిన ఆమె.. ఆ ప్రేమ, ఆదరణతో నన్ను విజేతగా చేస్తారని ఆశిస్తున్నానని తెలిపింది. ఇంతలో యానిమల్ సినిమాలోని ఎవరెవరో నాకెదురైనా అనే పాటను జామర్స్ బ్యాండ్ పాడటంతో విష్ణుప్రియకు పృథ్వీ గుర్తొచ్చి బాగా ఎమోషనల్ అయ్యింది.

ఇదిలాఉండగా .. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . అవినాష్ తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను చూస్తే.. గౌతమ్ 23 శాతం ఓటింగ్‌తో తన నెంబర్‌వన్ ప్లేస్‌ని కొనసాగిస్తున్నాడు. తర్వాత నిఖిల్ (22 శాతం), నబీల్ ( 17 శాతం) విష్ణుప్రియ (13 శాతం)తో సేఫ్ జోన్‌లో ఉన్నారు . అయితే అనూహ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ప్రేరణ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ప్రస్తుతానికి ప్రేరణ (13 శాతం), రోహిణి (12 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా టైం ఉండటంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











