Bigg Boss Telugu 8 : ఆమె తొక్క.. ఈమె బొక్క, మణికంఠను మరీ కరివేపాకులా.. కన్నడ బ్యాచ్ బూతు పురాణం

బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా థర్డ్ వీక్‌లోకి అడుగుపెట్టింది. గత వారం ఆర్‌జే శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా.. ఈ వారం నామినేషన్స్ మొదలుపెట్టారు బిగ్‌బాస్. గత రెండు వారాలకు భిన్నంగా ఈ వీక్ నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. గుడ్డు కోసం, దాని ఈకల కోసం అంటూ సిల్లీ రీజన్స్ చెప్పకుండా కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు. రెండు వారాల పాటు నామినేషన్స్ తప్పించుకున్న యష్మీ గౌడ .. తొలిసారిగా నామినేషన్‌లోకి రావడం ఈ వారం స్పెషాలిటీ. మంగళవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మూడో వీక్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్‌బాస్ తెలుగు 8లో వేగం పెరిగింది. గేమ్ ఎలా ఆడాలో, ప్రత్యర్ధిని ఎలా ఇరుకునపెట్టాలో తెలుసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. గత వారం లాగానే ఈ వీక్ కూడా 8 మంది కంటెస్టెంట్స్‌ నామినేషన్‌లలో నిలిచారు. నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, అభయ్, కిర్రాక్ సీత, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వి నామినేషన్స్‌లో నిలిచారు. ఎక్కువ మంది యష్మీనే టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

prerana kambam abuse naga manikanta during task in bigg boss telugu 8

చీఫ్‌నంటూ రెండు వారాల పాటు హౌస్‌లో పెత్తనం చేసిన యష్మీ గౌడ ఓవరాక్షన్‌ను ఇంటి సభ్యులు భరించలేకపోయారు. స్వయంగా నాగార్జున సైతం ఆమె తీరును తప్పుబట్టారు. బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా డిక్టేటర్‌లా వ్యవహరించిందని నెటిజన్లు మండిపడ్డారు. చీఫ్ పోస్ట్ నుంచి పీకి పారేయడంతో నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్ ఎగబడి మరి యష్మీకి ఓట్లు గుద్దేశారు. ఇంటి సభ్యులంతా మూకుమ్మడిగా టార్గెట్ చేయడంతో ఆమె సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టింది.

నాగమణికంఠను యష్మీ కావాలని టార్గెట్ చేస్తోంది. తాను ఇంట్లో ఉన్నన్ని రోజులూ నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడంతో చూద్దాం అంటూ మణి సై అంటాడు. అయితే నిన్నటి గొడవను పక్కకుపెట్టేయ్.. నామినేషన్స్‌లో జరిగింది పట్టించుకోవద్దంటూ యష్మీని వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు మణికంఠ. మంగళవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా మరో ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో ఇంట్లో లవ్ ట్రాక్స్ గురించి కంటెస్టెంట్స్ డిస్కషన్ పెట్టారు. నిఖిల్ - సీతను, పృథ్వీ - యష్మీని ఫ్లర్ట్ చేస్తున్నారని ఇంటి సభ్యులు మాట్లాడుకున్నారు. అలాగే యష్మీ అంటే నీకు ఇష్టం కదా అని పృథ్వీని సోనియా అడుగుతుంది.

ఇంతలో బిగ్‌బాస్ అలారం మోగించి నత్తలా సాగకు ఒక్కటీ వదలకు అనే టాస్క్ ఇస్తాడు. దీనిలో భాగంగా నత్తలా పాకుతూ క్యాబేజీని దొర్లించాలి. ఈ టాస్క్‌కి నాగమణికంఠ సంచాలక్‌గా వ్యవహరిస్తాడు. గేమ్‌లో స్టార్ట్ అవ్వగానే... నిఖిల్, ప్రేరణ తలపడతారు.. ఫిజికల్ టాస్క్‌లలో యాక్టీవ్‌గా ఉండే నిఖిల్ చాలా స్పీడ్‌గా టార్గెట్ రీచ్ అవుతాడు. అయితే ఇందులో ప్రేరణ ఓడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె మణికంఠతో గొడవ పడగా.. నువ్వెవరు చెప్పడానికి అని ప్రశ్నిస్తుంది. నేను సంచాలక్‌ని అని మణికంఠ యాటిట్యూడ్ చూపించగా.. తొక్కలో సంచాలక్ అని ప్రేరణ మండిపడుతుంది. అక్కడితో ప్రోమో ముగిసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X