Who Is Prerana? బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రేరణ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ మీకు తెలుసా?

Prerana Kambam Biography: ప్రేరణ కంభం టీవీ సీరియల్ యాక్టరెస్.. తెలంగాణ నటి ప్రేరణ కన్నడ అండ్ తెలుగు భాషలలో నటిస్తుంది. ఈమె హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. జూన్ 18 వ తారీకున 1996 లో మంగళవారం నాడు జన్మించింది. ఈమె నివసించేది మాత్రం బెంగళూరు, కర్ణాటక. దయానంద సాగర్ కాలేజ్, బెంగళూరు లో కాలేజీ చదువు పూర్తి చేసింది. ప్రేరణ కంభం అభిరుచులు చూసినట్లైతే.. ఈ బ్యూటీ సంగీతం ఎక్కువగా వింటుందట. ఇక ఈ భామ 2017 లో హరహర మహాదేవ్ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం తన అద్భుతమైన నటనతో రంగనాయకి వంటి సీరియల్స్‌లో అవకాశం దక్కించుకుంది. ప్రేరణ కేవలం సీరియల్స్‌లోనే కాదండోయ్.. 2018 లో చూరికట్టె అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. తర్వాత ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాల్లో మెరిసింది. ఇక 2021 లో ప్రముఖ రియాలిటీ షో అయిన కన్నడ బిగ్‌బాస్ మినీ సీజన్‌లో పాల్గొని.. ఆడియన్స్‌ను అలరించింది. 2022 లో 'కృష్ణా ముకుందా మురారి' అనే తెలుగు సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఫేవరెట్ నటిగా ముద్ర వేసుకుంది.

Prerana Kambam Biography Age Family Boyfriend Serials Height Bigg Boss 8 Telugu And More

ప్రేరణ కంభం మ్యారేజ్ లైఫ్

ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ నటి సుందరి శ్రీపాద్‌ను 2023 లో వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి బెంగళూరులో కన్నడ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహనంతరం కూడా ఈ బ్యూటీ సీరియల్స్‌లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే కృష్ణా ముకుందా మురారి సీరియల్‌లో నటిస్తోంది.

ఇకపోతే ఈ అమ్మడు ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే బిగ్‌బాస్ సీజన్‌- 8 లో పాల్గొంది. హౌస్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ కంటెస్టెంట్లందరూ రివీల్ అయ్యారు. నేడు ఉదయం బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన ఓ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీక్షించిన బిగ్ బాస్ ప్రియులు చాలా ఎక్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. కంటెస్టెంట్లందర్ని ఈ రోజు రాత్రి 7 గంటలకు రివీల్ చేయనున్నారు. ప్రేరణ కంభం బిగ్ బాస్ 8 హౌస్‌లో సందడి చేయనుందని క్లారిటీ రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

More from Filmibeat

Read more about: nagarjuna star maa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X