Bigg Boss Voting : నబీల్‌కు దెబ్బేసిన ప్రేరణ.. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌కి, దారుణంగా నిఖిల్ పరిస్థితి?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దివారాల్లో ఈ మెగా గేమ్ షోకి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టాప్ 5లో ఎవరు ఉండనున్నారు? విజేత ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఇక 12వ వారం నామినేషన్స్ ముగియడంతో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
గత సీజన్‌లలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లోని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ ట్విస్ట్‌కు ప్రేక్షకులు షాక్ అవ్వగా.. సోమ, మంగళవారాల్లో బిగ్‌బాస్ ఎపిసోడ్లు మంచి వినోదాన్ని అందించాయి. ఇక నామినేషన్స్ ముగియడంతో కిర్రాక్ సీత అన్న మాటలతో నిఖిల్ బాధపడ్డాడు. నేను నిన్ను ఎప్పుడైనా వాడుకున్నానా అంటూ యష్మిని ప్రశ్నించాడు.

ఈ వారం నేను వెళ్లిపోతానంటే .. నేను వెళ్లిపోతానంటూ ఇద్దరూ బాధపడ్డారు. యష్మి బయటికి వెళ్లగానే తనకు ఇక ఓట్లేయొద్దని.. పక్కవాడిని తొక్కి తాను ఈ షో గెలవాలని రాలేదని నిఖిల్ కెమెరాల వంక చూస్తూ ఆడియన్స్‌కి వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో నబీల్, పృథ్వీ వచ్చి నిఖిల్‌ను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో మనసు మార్చుకున్న నిఖిల్.. ఇకపై నేనేంటో చూపిస్తా, బాగా ఆడతానంటూ మాట మార్చాడు.
అనంతరం ఈ వారం మెగా చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. దీని ప్రకారం కంటెస్టెంట్స్ పేరు ఉన్న టీ షర్ట్ లోపలికి వస్తుందని, బజర్ మోగేవరకు డ్యామేజ్ కాకుండా కాపాడుని అక్కడే ఉన్న బొమ్మకి తగిలించాలని ఇందులో గెలిచినవాళ్లు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని చెప్పాడు. దీంతో మెగా చీఫ్ కంటెండర్స్‌గా పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి నిలిచారు. ఈ సీజన్‌లో రోహిణి, పృథ్వీ, టేస్టీ తేజలు ఇప్పటి వరకు మెగా చీఫ్ కాలేదు. బిగ్‌బాస్ తెలుగు 8 త్వరలో ముగియనున్న నేపథ్యంలో వీరు ముగ్గురు గట్టిగా ట్రై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 12వ వారం హౌస్‌కి మెగా చీఫ్ ఎవరు కానున్నారో.

మొత్తంగా 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ. ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం.. నిన్నటి వరకు టాప్‌లో కొనసాగిన నబీల్‌కు ప్రేరణ, యష్మి షాకిచ్చారు. 21.44 శాతం ఓటింగ్‌తో ప్రేరణ నెంబర్‌వన్‌గా నిలవగా.. యష్మి 20.90 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో, 20.43 శాతంతో నబీల్ థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. 19.8 శాతంతో నిఖిల్ నాలుగో స్థానంలో, 17.43 శాతంతో పృథ్వీరాజ్ శెట్టి లాస్ట్ ప్లేస్‌లో నిలిచి ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి కొద్దిరోజులు సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











