బిగ్‌‌బాస్ తెలుగు 8 విజేతను తేల్చేసిన గూగుల్.. షాకింగ్‌గా ఆ కంటెస్టెంట్ విన్నరా?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 8వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అంటే ఆల్‌మోస్ట్ హాఫ్ సీజన్ కంప్లీట్ కానుండటంతో విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. లిస్ట్‌లో చాలా మంది పేర్లు వినిపిస్తుండగా.. వారం వారం ఫలితాలు మారిపోతున్నాయి. తాజాగా ఈ వీక్ ఓటింగ్‌‌తో బిగ్‌బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్‌గా ఒకరి పేరు బాగా వినిపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రతి ఏటా బిగ్‌బాస్‌ సీజన్ ఎప్పుడొచ్చినా విన్నర్ ఎవరో అంచనా వేస్తారు ప్రేక్షకులు. వాళ్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ 8వ సీజన్‌ మాత్రం ఆడియన్స్‌ ఊహకి అందడం లేదు. ఎవరు టాప్ 5లో ఉంటారో అర్ధం కావడం లేదు. తొలి రెండు వారాలు నిఖిల్ ‌తన లీడర్‌షిప్ క్వాలిటీస్, దూకుడుతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఈ సీజన్ విజేత నిఖిలేనని వార్తలు వచ్చాయి. కర్ణాటకకి చెందిన వ్యక్తి తెలుగు బిగ్‌బాస్ టైటిల్ విజేత అవ్వడమా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా నడిచింది.

prerana kambam Name appears on Google as the winner of Bigg Boss Telugu Season 8

ఈ తర్వాత సోనియా ఆకుల పేరు విన్నర్ రేసులో వినిపించింది. దూకుడైన ఆట, మంత్రాంగంతో ఈమె శివాజీని గుర్తుచేసింది. కానీ పృథ్వీ, నిఖిల్‌లను అడ్డుపెట్టుకుని సోనియా గేమ్ ఆడటంతో అనూహ్యంగా నాలుగో వారంలో ఎలిమినేట్ అయి ప్రేక్షకులకు షాకిచ్చింది. అయితే ఆమె ఈ వారం లేదా వచ్చే వారం హౌస్‌లో తిరిగి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు. అవసరమైతే సోనియా ఆకులను సడెన్ సర్‌ప్రైజ్‌గా ఇంట్లోకి పంపించొచ్చనే టాక్ మొదలైంది.

ఇక టైటిల్ రేసులో వినిపించిన మరో పేరు నబీల్ అఫ్రిది. స్లో అండ్ స్టడీ ఆటతీరుతో మెప్పిస్తున్న నబిల్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. రెండు వారాల పాటు ఓటింగ్‌లో నెంబర్‌వన్‌గానూ నిలిచి అనూహ్యంగా రేసులోకొచ్చాడు ఈ యూట్యూబర్. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఏ ఒక్కరూ కూడా నబిల్ గురించి బ్యాడ్‌గా చెప్పలేదంటే అతని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. మొన్నామధ్య మణికంఠ హౌస్‌ను వీడుతూ.. ఇంట్లో ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలో తెలిసిన తెలివైన కుర్రాడని నబిల్ ఇంకా బాగా ఆడాలని కోరుకున్నాడు.

prerana kambam Name appears on Google as the winner of Bigg Boss Telugu Season 8

పైన పేర్కొన్నవాళ్ల గురించి సోషల్ మీడియాలో అనుకున్నదే కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఏకంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ చెప్పేసింది. బిగ్‌బాస్ తెలుగులోనే తొలిసారిగా ఓ ఫిమేల్ కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ కానుందని సంకేతాలు ఇచ్చింది. అది ఎవరో కాదు.. ప్రేరణ కంభం. ఈవిడ చాలా సార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా.. ఈసారి మాత్రం ఓటింగ్‌లో దుమ్మురేపుతోంది. ఏకంగా టైటిల్ విన్నర్ అనుకున్న నిఖిల్‌ని పక్కకు నెట్టేసి ఓటింగ్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 8 విజేత ఎవరని సెర్చ్ చేస్తే గూగుల్‌లో ప్రేరణ అని వస్తోందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి గూగుల్ జోస్యం చెప్పినట్లుగా ప్రేరణే ఈ సీజన్ విజేత అవుతుందా ? లేదా అన్నది మరికొద్ది వారాల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X