‘ఆ హీరోతో కిస్సింగ్ సీన్‌... బాయ్‌ఫ్రెండ్‌ చేతిలో అలాంటి టార్చర్’

బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో ప్రేరణ కంబం కూడా ఒకరు. అయితే అంతకుముందే ఆమె సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నారు. స్టార్ మాలో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్‌తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రేరణ. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా స్థానం సంపాదించారు. తన మైండ్‌గేమ్‌, మంచితనంతో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. గౌతమ్, నిఖిల్ వంటి టాప్ కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల తీర్పు మేరకు గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేట్ అయ్యింది ప్రేరణ. సీరియల్స్, రియాలిటీ షోలలో పాల్గొంటున్నారు ప్రేరణ. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ ఫేమ్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్‌లో పాల్గొని తన తన కెరీర్, లవ్‌స్టోరీ సహా ఇతర విషయాలను బయటపెట్టింది.

2017లో హరహర మహదేవ్ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ కంబం. ఆ తర్వాత రంగనాయకి వంటి సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నారు. సీరియల్స్‌తో పాటు చూరికట్టె, ఆనా, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాలలో మెరిసింది. 2021లో కన్నడ బిగ్‌బాస్ మినీ సీజన్‌లో పాల్గొంది. 2022లో కృష్ణ ముకుందా మురారి అనే తెలుగు సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది. శ్రీపాద్ అనే వ్యక్తిని 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటికీ నటనను కంటిన్యూ చేస్తున్నారు ప్రేరణ. కిస్సిక్ టాక్ షోలో ఆమె మాట్లాడుతూ తన ప్రేమ గురించి బయటపెట్టారు.

Prerana Kambam Opens Up About Love Marriage and Bigg Boss Journey

28, 29 వయసు ఉన్న నా ఫ్రెండ్స్ కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. టైంపాస్‌కి నేను ప్రేమించలేదు.. నాకు ఆయన ఇంపార్టెంట్, ఆయనకి నేను ఇంపార్టెంట్. గొడవలు పడినప్పటికీ .. నీకన్నా గొడవలు ఎక్కువ కాదని అనుకుంటాం. నన్నెందుకు పెళ్లి చేసుకున్నానా అని మా ఆయన రోజూ అనుకుంటాడు. మా ఆయన కూడా చాలా స్ట్రిక్ట్.. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఒకటి రెండు వారాల్లో వచ్చేయాలని చెబుతాడని అనుకున్నా.. కానీ నా మీద ఆయనకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. ప్రేరణ వెళితే ఖచ్చితంగా కప్‌తోనే వస్తుందని అనుకున్నాడు. 4 నెలలు నాకు దూరంగా ఉంటావా? పెళ్లయి అప్పటికి 8 నెలలే. మా ఆయన ఫస్ట్ బర్త్ డే, మా మొదటి పెళ్లి రోజు, పండుగలు అన్నీ మిస్ అయ్యాయని ప్రేరణ ఆవేదన వ్యక్తం చేశారు.

కెరీర్ కోసం పర్సనల్ లైఫ్‌ని పక్కనపెట్టే రకం కాదు. బిగ్‌బాస్‌కి వెళ్లడానికి ముందు నాతో నాలుగైదు రోజులు మా ఆయన మాట్లాడలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో లాకప్‌లో ఉండాలి. నాకు సపోర్ట్‌గా ఉంటేనే అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పా.. ఫస్ట్ సైలెంట్‌గా ఉన్న ఆయన తర్వాతి నుంచి పూర్తిగా మారిపోయారు. బయటి నుంచి నాకు మా ఆయన సపోర్ట్‌గా నిలిచాడు. మేమిద్దరం క్లాస్‌మెట్స్.. బాగా చదువుతారు, టాపర్ కానీ చాలా సైలెంట్. థర్డ్ ఇయర్ ఫ్రెండ్స్ అయ్యాం... ఫోర్ట్ ఇయర్ నుంచి ఆయన బిహేవియర్ అర్ధం చేసుకున్నా. నాలో ఏం చూసి ఇష్టపడ్డావని ఇప్పటికీ అడుగుతూనే ఉంటానని ప్రేరణ తెలిపారు.

కాలేజీలో ఉన్నప్పుడే ఆయన వేరే అమ్మాయిని చూడటం నేను గమనించా. పేరెంట్స్‌కి శ్రీపాద కూడా తెలుసు కాబట్టి.. మా ప్రేమకు ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఏ ప్రాబ్లమ్ లేకుండా మా రిలేషన్ షిప్ సాగిందని నేను నమ్మను.. బ్రేకప్స్ మాకు కూడా జరిగాయి. నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ప్రాజెక్ట్‌లో హీరో బుగ్గ మీద ముద్దుపెట్టాల్సి ఉంది. శ్రీపాద్‌కి నా ప్రాజెక్ట్స్ ఏం తెలియవు, డేటింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ చేశా.. అప్పుడు ఆయనకి బాయ్‌ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది. కిస్ చేసినప్పుడు యాక్టింగ్‌లో ఇలా ఉంటుందా? నేను ఇదంతా తట్టుకోలేను, బ్రేకప్ అనేశాడు. తర్వాత నేను ఆ సీన్ గురించి శ్రీపాదకు చెప్పా. ఆయనకు ఈ ప్రాసెస్ మొత్తం అర్ధం కావడానికి టైం పట్టింది, తర్వాత పెళ్లి చేసుకున్నామని తన లవ్ స్టోరీని బయటపెట్టారు ప్రేరణ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Read more about: prerana kambam bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X