Bigg Boss Telugu Voting: నిఖిల్‌కి దెబ్బేసిన ప్రేరణ, ఓటింగ్‌లో టాప్‌ ప్లేస్‌కి..డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నాగ మణికంఠ అనారోగ్య సమస్యలతో సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో ఆడియన్స్, తోటి కంటెస్టెంట్స్ షాక్ అవుతారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ రచ్చ షురూ అయ్యింది. ఏడో వారంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని కంటెస్టెంట్స్ మోత మోగించారు. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు? ఓటింగ్‌ ఎలా జరుగుతోంది? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

సోమవారం ఎపిసోడ్ మొదలవ్వగానే నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టాడు బిగ్‌బాస్. ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలని, మెగా చీఫ్ అయిన కారణంగా గౌతమ్‌ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని చెబుతారు. ప్రతి కంటెస్టెంట్.. ఇంట్లో ఉండటానికి అర్హత లేదని భావించే ఇద్దరు కంటెస్టెంట్స్‌కి చెందిన దిష్టిబొమ్మల మీద కుండలు పెట్టి తగిన కారణాలు చెప్పి వాటిని పగులగొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక్కడే బిగ్‌బాస్ ప్రైజ్ మనీకి కోత పెట్టే స్కెచ్ వేశాడు.

prerana kambam placed top in 8th week Voting in bigg boss telugu 8

గౌతమ్‌ని పిలిచి ఇంట్లో ఓ నామినేషన్ షీల్డ్ ఉంటుందని, దానిని మీకు నచ్చిన ఇంటి సభ్యుడికి ఇవ్వొచ్చని.. అది ఎవరికైతే ఇస్తారో ఆ కంటెస్టెంట్‌ని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ.50 వేలు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని షాకిస్తాడు. దీంతో గౌతమ్ ఆ షీల్డ్ ఎవరికి తీసుకొచ్చి ఇస్తాడోనని కంటెస్టెంట్స్‌ అంతా టెన్షన్ పడతారు. కాసేపటికీ నామినేషన్స్ షీల్డ్‌ని హరితేజకి ఇస్తాడు గౌతమ్. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో ఆమె చూపించిన ఫైర్ చాలా మందికి నచ్చిందని.. ఇప్పుడు ఇంకా దానిని బయటికి తీయలేదని అంటాడు.

ఈ వారం తొలి నామినేషన్‌ని విష్ణుప్రియ స్టార్ట్ చేస్తుంది. విష్ణు, నిఖిల్‌కి ఆమె నామినేషన్ వేసింది. రోహిణి .. నిఖిల్‌, పృథ్వీలని, పృథ్వీ.. రోహిణి, ప్రేరణలని, నయనీ పావని.. మెహబూబ్, నిఖిల్‌లని, హరితేజ.. ప్రేరణ, మెహబూబ్‌లని.. నబీల్.. ప్రేరణ, హరితేజలని నామినేట్ చేశారు. హరితేజకి నామినేషన్ పడటంతో ప్రైజ్‌మనీ తగ్గింది. సోమవారం నాటికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అది మంగళవారం కంటిన్యూ కానుంది.

అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. వీటిని బట్టి ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారట. వారు నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, నయని పావని, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఉన్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ని పరిశీలిస్తే.. ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా టాప్‌లో నిలిచే నిఖిల్ అనూహ్యంగా వెనుకబడ్డాడు. ప్రేరణ దాదాపు 26 శాతం ఓటింగ్‌తో నెంబర్‌వన్‌గా నిలవగా.. నిఖిల్ 25 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

తర్వాత వరుసగా విష్ణుప్రియ (15 శాతం), నయని పావని (13 శాతం), పృథ్వీరాజ్ (12 శాతం), మెహబూబ్ (10 శాతం)తో నిలిచారు. ప్రస్తుతానికి పృథ్వీ, మెహబూబ్‌లు డేంజర్‌ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ అఫీషియల్‌గా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఓపెన్ కానుండటంతో ఇంకా చాలా టైమ్ మిగిలే ఉంది. ఈ లోపు ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X