మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడితో బిగ్ బాస్ భామ శృంగార విన్యాసాలు వైరల్!
ఇండియాలో బిగ్ బాస్ షో ఎంత పాలుపర్ అయిందో.. ఆ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా అదే స్థాయిలో పెద్ద సెలెబ్రిటీలుగా మారుతున్నారు. ప్రస్తుతం యువిక చౌదరి, ప్రిన్స్ నరుల బాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీలుగా మారారు. వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ బిగ్ బాస్ 9 విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ తరువాత కూడా ఈ జంట హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ తరువాత యువిక, ప్రిన్స్ ప్రేమికులుగా మారారు.

రిలేషన్ షిప్
యువిక, ప్రిన్స్ గురించి బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సమయంలో ఈ జంట తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం అని ప్రకటించారు. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ ఇటీవలే జరిగింది. మరి కొద్దిరోజుల్లో వివాహానికి కూడా సిద్ధం అవుతున్నారు.

సెక్సీ లుక్స్‌తో
అక్టోబర్ 12 యువిక, ప్రిన్స్ వివాహం ముంబైలో ఘనంగా జరగబోతోంది. వివాహానికి ముందు ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చారు. ఫోటో షూట్ లో యువిక, ప్రిన్స్ సెక్సీ లుక్స్ తో అదరగొట్టారు. ఘాటైన రొమాన్స్ తో ఉన్న ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్రియుడికన్నా ఏడేళ్లు పెద్ద
యువిక తన ప్రియుడు ప్రిన్స్ కన్నా ఏడేళ్లు పెద్ద వయసు కావడం విశేషం. యువికకు 35 ఏళ్ల వయసు కాగా, ప్రిన్స్ కు 28 ఏళ్ళు. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపొయింది. బడా సెలెబ్రిటీలు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రియాంక చోప్రా కాబోయే భర్త నిక్ జోనస్ తనకన్నా 10 ఏళ్ళు చిన్నవాడు.

పలు భాషల్లో
యువిక పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, పంజాబీ చిత్రాలలో కూడా యువిక మెరిసింది. ఇప్పటికి కొన్ని అవకాశాలు ఆమె చేతిలో ఉన్నాయి. వివాహం తరువాత నటన కొనసాగిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











