Bigg Boss Telugu 7: ఈ సీజన్‌లోనే బిగ్ ఫైట్.. శివాజి ఆ పని చేయడంతో.. నోరు జారి దొరికిపోయిన అమర్
బుల్లితెరపై పెట్టుకున్న బౌండరీలను చెరిపేస్తూ కొత్త రకాల కాన్సెప్టులతో నడుస్తోన్న షోనే బిగ్ బాస్. మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే ఇది భారీ స్థాయిలో రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షో అనిపించుకుంటోంది. ఈ జోష్‌లోనే నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తోన్న ఇందులో కంటెస్టెంట్ల మధ్య గొడవలు బీభత్సంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హౌస్‌లో ఊహించని పరిణామాలు జరిగాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఇందులో అసలు ఏమాత్రం అంచనాలు వేయని ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నామినేషన్స్ టాస్కులు కూడా గొడవలతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 11వ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ కొందరి మధ్య ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టి - ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన వాగ్వాదం ఎంతో హైలైట్ అయింది. గత వారంలో తనను సెల్ఫ్ నామినేట్ అయ్యేలా చేసింది అని, తన మీద నెగెటివిటీ ఉందనే చాక్లెట్ ఇచ్చానని కారణాలు చెప్పి మరీ నామినేట్. దీంతో శోభాకు కోపం వచ్చింది. అప్పుడామె 'నాకు నామినేట్ చేయడం కుదరలేదు. లేకుంటే నిన్నే చేసేదాన్ని' అంది.
శోభా శెట్టి మనసులోని మాటను బయటపెట్టడంతో యావర్ 'నీకు నా మీద నెగటివిటీ ఉందని చెప్పి దొరికిపోయావు. నీ ఒరిజినల్ ఇదే' అని పాయింట్ పట్టుకున్నాడు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత అశ్విని - ప్రియాంకను నామినేట్ చేసింది. ఆ సమయంలో కూడా వాగ్వాదం జరిగింది. అనంతరం తనపై పాట పాడాడన్న కారణంతో అమర్‌దీప్‌ను అశ్విని నామినేట్ చేసింది. అప్పుడామె అతడిని బావ అని పిలిచి నవ్వించింది.
ఇక, మంగళవారం ఎపిసోడ్ మొత్తంలో ప్రిన్స్ యావర్ - అమర్‌దీప్ చౌదరి మధ్య జరిగిన వాగ్వాదం మరింత హైలైట్ అయింది. ముందుగా అమర్‌ను యావర్ నామినేట్ చేశాడు. గత వారం కెప్టెన్సీ టాస్కులో తన బొమ్మను పట్టుకుని కావాలనే ఔట్ చేశాడని దీనికి కారణం చెప్పాడు. అప్పుడు రతికా రోజ్ టాపిక్‌ను కూడా తీసుకు వచ్చాడు. దీంతో ఇది పెద్ద వివాదంలా మారింది.

అనంతరం అమర్‌దీప్ చౌదరి కూడా ప్రిన్స్ యావర్‌ను నామినేట్ చేశాడు. ఆ సమయంలో మళ్లీ రతికా టాపిక్ వచ్చింది. 'ఫేం కోసమే రతికా వెనుక యావర్ తిరుగుతున్నాడు అని అమర్ అన్నాడు' అని ప్రిన్స్ గొడవ పడ్డాడు. ఆ పుటేజ్ కూడా కావాలని బిగ్ బాస్‌కు రిక్వెస్ట్ చేశాడు. దీంతో అమర్ 'నేను రతికాతో చెప్పింది నువ్వు చూశావా? విన్నావా' అని ఫైర్ అయ్యాడు.
ఈ గొడవలో అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్ ఇద్దరూ సహనం కోల్పోయారు. అప్పుడు ఒకరి మీదకు ఒకరు వెళ్లి కొట్టుకునేంత పని చేశారు. ఆ సమయంలో అమర్ అతడిని మరింత రెచ్చగొడుతూ 'కొడతావా? కొట్టు. బిగ్ బాస్ చెప్తే కొడతావా' అంటూ మాట్లాడాడు. అప్పుడు పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో శివాజి మధ్యలోకి వెళ్లి ఇద్దరినీ దూరంగా పంపించాడు.
ప్రిన్స్ యావర్‌తో గొడవ జరిగిన తర్వాత అమర్‌దీప్ 'నేను కావాలనే వాడిని రెచ్చగొట్టాను. కాసేపు ఉంటే కొట్టేసేవాడు. శివాజి అన్న రాకుండా ఉంటే బాగుండేది' అన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న గౌతమ్ 'వాడికి అంత సీన్ లేదు. నా గొడవ అప్పుడు చూశావు కదా' అన్నాడు. మొత్తానికి అమర్ కావాలనే యావర్‌ను రెచ్చగొట్టినట్లు తర్వాత ఒప్పుకున్నాడు.


Click it and Unblock the Notifications











