Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ కాబోయేది ఆ కంటెస్టెంటే.. డేంజర్ జోన్‌లో ఇద్దరు.. కానీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతందో. ఇప్పటికే విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఈరోజుటితో 14వ వారంలోకి అడుగు పెడుతుంది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్పీని సొంతం చేసుకుంటూ అద్భుతమైన ట్విస్ట్ లు అంతకు మించిన ఎమోషన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ప్రస్తుతం ఇంట్లో మొత్తం ఏడుగురు మాత్రమే ఉండగా.. ఈ వారం నామినేషన్లలో చాలా మందే ఉన్నారు. ఒక్క అంబటి అర్జున్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్లలోకి వచ్చినట్లు అర్థం అవుతుంది.
ముఖ్యంగా శివాజి, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశఆంత్ లు నామినేషన్లలో ఉండగా... ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఆ ఇద్దరికే ఎక్కువాగ ఉన్నట్లు తెలుస్తోంది. అయిత ఆ ఇద్దరు ఎవరు, అసలు వారు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఎలా ఉన్నారు, ఎందుకు ఎలిమినేట్ అవుతారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈషోలో చాలానే రాజకీయాలు సాగుతున్నట్లు నెట్టింట పెద్దగా చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్ షో నిర్వాహకులు.. తమకు నచ్చిన వారిని కాపాడేందుకే ఈ ఉల్టాపుల్టా కాన్సెప్ట్ ను తీసుకు వచ్చారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. స్టార్ మా బ్యాచ్ కు చెందిన అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారని అంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ దత్తపుత్రికి, ముద్దు బిడ్డ శోభాశెట్టిని కాపాడుకోవడానికి గతంలో ఎలిమినేషన్ కూడా ఎత్తేసిన బిగ్ బాస్ ఈ సారి కూడా పెద్ద స్కెచ్చే వేశాడు. 13వ వారం డేంజర్ జోన్ లో ఉన్న ఆమెను కాపాడుకోవడానికి మరో కంటెస్టెంట్ ను బలి చేశాడు.
ముఖ్యంగా అశ్వత్థామ 2.0.. గౌతమ్ కృష్ణను ఈ వారం ఎలిమినేట్ చేసి అందరూ ఊహించని విధంగానే చేశారు. అయితే బిగ్ బాస్ కచ్చితంగా వారిని కాపాడుకుంటారని అంతా అనుకున్నారు. అచ్చం అలాగే జరిగింది. అయితే ఈ వారం కూడా శోభా శెట్టికి బదులుగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇక 14వ వారంలో నామినేషన్స్ చూసుకుంటే.. శివాజి, పల్లవి ప్రశాంత్ లకు ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. సో వీరిద్దరూ అస్సలే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఫినాలే అస్త్ర గెలుచుకున్న అంబటి అర్జున్ టాప్ 5లోకి వస్తాడు. సో ఈయనకు కూడా ఛాన్స్ లేదు. ఇకు మిగిలిన వాళ్లు ప్రియాంక జైన్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్.

ఇందులో ప్రియాంక కూడా బాగానే గేమ్ ఆడుతోంది. మిగిలిన ఇద్దరితో పోలిస్తే ఈమెకు కూడా ముందు నుంచి ఓటింగ్ బాగానే వస్తోంది. ఇక డేంజర్ జోన్ లో ఉంది బిగ్ బాస్ ముద్దుబిడ్డ శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ మాత్రమే. ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ తన దత్త పుత్రికు శోభాశెట్టిని కాపాడుకుంటాడనే చర్చ సాగుతోంది. ఇక చివరగా మిగిలి పోయిన ప్రిన్స్ యావరే ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ పై వస్తున్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తే చేయొచ్చు. లేదా కన్ఫార్మ్ గా ఈసారి ప్రిన్స్ యావరే ఎలిమినేట్ అయిపోతాడు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.


Click it and Unblock the Notifications











