Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కు మరో ఫ్రెండ్ వెన్నుపోటు.. గెలవకుండా ప్లాన్.. బిగ్ బాస్ ట్విస్ట్

బిగ్ బాస్.. బుల్లితెరపై ప్రేక్షకులకు అస్సలు పరిచయమే అవసరం లేని షో ఇది. అంతలా ఇది సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్‌ను రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ షో దేశంలోనే అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. దీంతో వరుసగా సీజన్ల మీద సీజన్లు పూర్తి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్‌కు ఓ కంటెస్టెంట్ వెన్నుపోటు పొడిచాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కన్ఫార్మ్ కంటెస్టెంట్ అవడం కోసం ప్రతి వారం పవర్ అస్త్ర టాస్కులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 4వ వారానికి సంబంధించి 'బిగ్ బాస్ బ్యాంక్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో బ్యాంకర్లు అయిన శివాజి, సందీప్, శోభా శెట్టిలు హౌస్‌లోని కంటెస్టెంట్లకు కాయిన్స్ ఇచ్చారు. వాళ్లకు బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇస్తున్నట్లు తెలిపాడు.

Prince Yawar Backstabs to Pallavi Prashanth In Bigg Boss 7 Telugu Show

బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ టీమ్.. రతికా రోజ్, టేస్టీ తేజ మీద విజయం సాధించింది. అలాగే, గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గరే కూర్చుని కనిపించారు. ఫుడ్ కూడా అక్కడే తినడంతో పెద్ద గొడవ కూడా జరిగింది. అయితే, ఇద్దరిలో ఎవరు బజర్ నొక్కినా ఒకే టీమ్‌గా ఆడాలని ప్లాన్ చేసుకున్నారు.

రెండో రౌండ్‌లో భాగంగా బజర్ మోగిన వెంటనే అందరి కంటే ముందే ప్రిన్స్ యావర్ నొక్కేశాడు. ఇందులో ఏడ్చి అయినా.. నవ్వుకుంటూ అయినా కన్నీళ్లతో గ్లాస్‌ను నింపాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ప్రిన్స్ తన పార్ట్‌నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నాడు. అలాగే, ప్రత్యర్థి జట్టుగా అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణను సెలెక్ట్ చేసుకున్నాడు.

ఎంతో కొత్తగా సాగిన ఈ టాస్కులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ టీమ్ విజయం సాధించింది. దీంతో అమర్‌దీప్, గౌతమ్ దగ్గర ఉన్న 151 కాయిన్స్‌ కూడా వీళ్ల సొంతం అయ్యాయి. వాటిని ప్రశాంత్ 76, ప్రిన్స్ 75 తీసుకున్నారు. దీంతో వీళ్లిద్దరే అత్యధిక కాయిన్స్ దక్కించుకున్న కంటెస్టెంట్లుగా నిలిచారు. ఇక, ఈ ఓటమితో అమర్‌దీప్, గౌతమ్ దగ్గర కాయిన్స్ జీరో అయిపోయాయి.

ప్రశాంత్ సహాయంతో టాస్కులో గెలిచిన ప్రిన్స్ యావర్.. ఆ తర్వాత అతడికే వెన్నుపోటు పొడిచేలా ప్లాన్ చేశాడు. శుభశ్రీతో మాట్లాడుతూ.. 'నేను నెక్ట్స్ రౌండ్‌లో బజర్ కొడితే నిన్ను నా పార్ట్‌నర్‌ను చేసుకుంటా. అలాగే, ప్రశాంత్, ప్రియాంకను ప్రత్యర్థులుగా ఎంపిక చేస్తాను. ఎందుకంటే వాళ్ల దగ్గరే కాయిన్స్ ఉన్నాయి. అవి గెలిస్తే మనమే కంటెండర్స్ అవుతాయి' అన్నాడు.

ప్రిన్స్ యావర్ ప్లాన్ చేసినట్లు కాకుండా బిగ్ బాస్ ఇక్కడితో ఈ టాస్క్ ముగిసిందని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, ప్రిన్స్, ప్రశాంత్ ఇద్దరూ పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండర్లుగా నిలిచారని చెప్పాడు. దీంతో వెన్నుపోటు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రిన్స్‌పై విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X