Bigg Boss Telugu 7: యావర్‌తో బిగ్‌బాస్ దాగుడుమూతలు.. అన్నను పంపి అమ్మకోసం ఏడిపించేశాడుగా!
Prince Yawar Brothe in BB House: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిగ్ బాస్ షో అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. సీజన్ ల మీద సీజన్లు చేస్తూ నిర్వాహకులు కూడా ఫుల్లుగా సంపాధించుకుంటున్నారు. అన్ని సీజన్లకంటే కూడా ఈసారి వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా పదో వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ నిర్వహించడం.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం అద్భుతంగా సాగుతోంది. వారితో హౌస్ మేట్స్ చేసే రచ్చ, ఎమోషన్స్ ను బిగ్ బాస్ బాగానే క్యాచ్ చేస్తూ టీఆర్పీని పెంచేసుకుంటున్నాడు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లోకి చాలా మంది కుటుంబ సభ్యులే వచ్చారు. ముందుగా శివాజి కొడుకు, అర్జున్ అంబటి భార్య, అశ్విని శ్రీ తల్లి, గౌతమ్ కృష్ణ మదర్, భోలె షవాళి భార్య, ప్రియాంక జైన్ ప్రియుడు శివ కుమార్ లు వచ్చారు. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో అమర్ దీప్ భార్య, శోభా శెట్టి తల్లి రాబోతున్నట్లు ఇప్పటి వరకు విడుదల అయిన ప్రోమోలు చూస్తుంటే అర్థం అయింది. అయితే బిగ్ బాస్ టీం తాజాగా మరో ప్రోమోను విడుదల చేసింది. అందులో ప్రిన్స్ యావర్ సోదరుడు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొన్న శివాజి కొడుకును పంపినట్లుగానే చాలా పెద్ద ప్లాన్ తోనే యావర్ సోదరుడిని కూడా పంపారు.

అయితే కేవలం వాయిస్ మాత్రమే వినిపించేలా చేస్తూ.. మెయిన్ గేట్ ను మూస్తూ తెరుస్తూ.. దాడుగు మూతలు ఆడుకున్నాడు బిగ్ బాస్. ప్రిన్స్ యావర్ సోదరుడు యావు, యావు అంటూ ప్రేమగా పిలుస్తుంటే.. యావర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. తన అన్న ఎటువైపు నుంచి వస్తున్నాడో, పిలుపు ఎక్కడి నుంచి వినిపిస్తుందో తెలియక అల్లాడిపోయాడు. ఇల్లంతా ఒకటే పరుగులు పెడుతూ సోదరుడిని గురించి వెతికాడు. కానీ సడెన్ గా ప్రిన్స్ యావర్ సోదరుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు.
అది గమనించిని ప్రిన్స్ యావర్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోదరుడిని హగ్ చేసుకున్నాడు. వెంటనే తన అన్న తమ్ముడి నుదిటపై ముద్దు పెట్టాడు. ఇది చూసిన హౌస్ మేట్స్ అంతా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. క్లాప్స్ కొడుతూ మరీ యావర్ సోదరుడికి వెల్ కమ్ చెప్పారు. ముఖ్యంగా యావర్ సోదరుడు... మీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో చెప్పిన విధానం నిజంగా ఆకట్టుకుంది. ఓ చోట పల్లవి ప్రశాంత్, శివాజి, యావర్ సోదరుడు కూర్చొని ఉండగా.. తన అన్న కాళ్ల వద్ద ఉన్న యావర్ అలాగే పడుకుని ఉండిపోయాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ కు యావర్ సోదరుడు థాంక్స్ చెప్పాడు. నిజంగా యావర్ కు తల్లిప్రేమ తెలియదని.. చెప్పగా అంతా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత అన్నాతమ్ముళ్లు ఇద్దరే ఓ చోట కూర్చోగా.. యావర్ బాగా ఏడ్చేశాడు. అతడిని ఊర్కోబెడుతూనే సోదరుడు కూడా ఏడ్చాడు. అది చూసిన శివాజి వారి వద్దకు వెళ్లి ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు. వీ ఆర్ ఫైటర్స్... ఫైట్ ఫర్ ఇట్.. ఐ వాంట్ దట్ కప్ అంటూ అన్న చెప్పగా యావర్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఇలా ఈ ప్రోమో ముగిసింది. పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఈరోజు రాత్రి 9 గంటల వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











