Bigg Boss Telugu 7: రతికాతో లవ్ ట్రాక్.. కానీ పెళ్లి మాత్రం ఆమెతోనేనట.. తొలిసారి రివీల్ చేసిన యావర్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన వచ్చిందో తెలియదు కానీ అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రేపటితో ఈ షో ముగిసిపోతుండగా... అంతా విన్నర్ ఎవరా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టాప్ లో ఉండబోయేది ఎవరు ఎవరు ఎంత డబ్బులు గెలుచుకుంటారని అనుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. మొదటి వారం హౌస్ లో అడుగు పెట్టి అసలు తెలుగే రాకపోయినా ఫైనల్స్ వరకూ వచ్చాడు యావర్.

తనకు వచ్చిన తెలుగుతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. అద్భుతంగా టాస్క్ లు ఆడుతూ.. అందరి చేత ఆహా అనిపిస్తున్నాడు. అతడి జర్నీ వీడియో చూస్తే చాలు అతను బిగ్ బాస్ హౌస్ లో ఎంత బాగా ఆట ఆడాడో తెలిసిపోతుంది. ముఖ్యంగా మొదటి వారమే హౌస్ లోకి అడుగు పెట్టిన అతడు... అందరితో కలుపుగోలుగా ఉన్నాడు. ముఖ్యంగా శివాజి, పల్లవి ప్రశాంత్ లతో మరింత క్లోజ్ గా ఉంటూ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. వీరి ముగ్గురి బాండింగ్ చూసి స్పై బ్యాచ్ అనే పేరు కూడా పెట్టేశారు ప్రేక్షకులు.

 Prince Yawar Carrity About His Maariage And Love Check Details

ముఖ్యంగా ముందు వారం రతికా రోజ్ తో పులిహోర కలిపిన పల్లవి ప్రశాంత్ కు రతికా రోజ్ గట్టి షాకిచ్చింది. ముందు తనకు కూడా ఇష్టం ఉన్నట్లుగానే ప్రవర్తించి రెండో వారం నామినేషన్స్ నుంచి తన అసలు రంగు బయట పెట్టింది. అలా అలా అందరిలోనూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. వెంటనే ప్రిన్స్ యావర్ పులిహోర కలపగా.. అతడితో మాట్లాడింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒకరికొకరు చెప్పుకొని చాలా హడావుడే చేశారు. ముఖ్యంగా రైతుబిడ్డపై చేసిన కామెంట్లతో ఎలిమినేట్ అయిపోయిన ఆమె తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చినప్పటి నుంచి స్పై బ్యాచ్ తోనే ఉంటూ...యావర్ తో ఎక్కువ స్నేహంగా ఉంది.

అయితే యావర్ కూడా రతికా రీఎంట్రీ తర్వాత ఎక్కువగా ఆమెతోనే తిరిగాడు. దీంతో ఆయనకు కొంత నెగిటివిటీ కూడా వచ్చింది. ఇక రెండోసారి ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయాక... మళ్లీ మనోడు గేమ్ చక్కగా ఆడుతున్నాడు. అయితే తాజాగా ఆయన చేసన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ హౌస్ లోంటి వెళ్లిన అమ్మాయే. అయితే ఆమె మాత్రం రతికా కాదంట. మరెవరో మనం ఇప్పుడు తెలుసుకుదాం.

చివరి వారంలో భాగంగా హౌస్ లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలోనే కంటెస్టెంట్లు అందరితో ఫుల్ ఫన్ చేసింది. ముఖ్యంగా ఓ ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి అందులో ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్పమని ప్రిన్స్ యావర్ ను అడిగింది. వెంటనే యావర్ అశ్విని శ్రీ పేరు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆయనకు అశ్విని పై ప్రేమ ఉందని అర్థం అయిపోతుంది. మరి రతికా రోజ్ తో పులిహోర కలిపిన యావర్ అశ్విని శ్రీని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడో తెలియాలంటే ఈరోజుటి ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X