Bigg Boss Telugu 7 Finale: యావర్ క్రష్ లిస్ట్‌లో ఎంత మంది అమ్మాయిలో ఉన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని స్థాయిలో అదరగొడుతూ రచ్చ చేసిన ఈ షో.. ఈరోజు కూడా చాలా గ్రాండ్ గా ఫినాలే ఎపిసోడ్ ను ప్లే చేస్తోంది. అదిరిపోయే స్థాయిలో అందరినీ అలరిస్తున్న ఈ ఫినాలే ఎపిసోడ్ చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా టీవీల ముందు వాలిపోయారు. మరికాసేపట్లో ఈ సీజన్ విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలియబోతుంది. అవి మాత్రమే కాకుండా హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్లకు సంబంధించిన అదిరిపోయే సీక్రెట్ లు కూడా స్టేజీపై రివీల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ప్రిన్స్ యావర్ క్రష్ లిస్టు గురించి హౌస్ మేట్స్ షాకింగ్ న్యూస్ తెలిపారు. ముఖ్యంగా యావర్ కు ఉన్నది క్రష్ కాదని... చాలా మందితో ఆయన పులిహోర కలిపారని చెప్పేశారు. వారి పేర్లు కూడా చెప్పేశారు. అదేం లేదంటూ యావర్ చాలానే కవర్ చేసుకున్నా.. హౌస్ మేట్స్ మాత్రం చాలా క్లియర్ గా వాళ్ల పేర్లు, మోహాలను చూపిస్తూ మరీ వెల్లడించారు. అయితే ఆయన క్రష్ లిస్టులో ఎంత మంది ఉన్నారు, వారి పేర్లు ఏంటో మనం ఇప్పుడ తెలుసుకుంది.

బిగ్ బాస్ షోను మొదటి నుంచి చూసిన వారికి రతికా రోజ్ పై ప్రిన్స్ యావర్ కు ఇష్టం ఉందని తెలుస్తుంది. ఆయనతో సింగర్ ధామిని కూడా పులిహోర కలిపింది. యావర్ ఐ గాట్ ఫీవర్ అంటూ ఓ కవిత కూడా చెప్పగా.. అది చాలా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి ప్రిన్స్ యావర్ రతికా రోజ్ తో ఎక్కువగా కనిపించాడు. ఇటీవలే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక దుబాయ్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు కూడా శివాజి రివీల్ చేశారు. యావర్.. అదేం లేదు స్నేహం మాత్రమే ఉందంటూ చెప్పాడు. కానీ ఆమె ఒక్కతే కాకుండా మరికొంత మంది కూడా ఆయన క్రష్ లిస్టులో ఉన్నారని తెలిసిపోయింది.
ఫినాలే ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగారు. దానికి అందరూ కలిసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా యెస్ ఆర్ నో అని మాత్రమే చెప్పాల్సి ఉండగా.. యావర్ కు యెస్ ఆర్ నోనే కాకుండా పెద్ద ఉపోద్ధాతం కూడా ఇచ్చారు. ముఖ్యంగా యావర్ కు హౌస్ లో ఓ క్రష్ ఉంది అని నాగార్జున అనగా... అంతా యస్ అని చెప్పారు. కానీ యావర్ మాత్రం కాదంటూ చెబుతుండగానే... యావర్ కు క్రష్ కాదు సార్ క్రషెస్ ఉన్నాయి.. క్రషర్ మిషన్ అంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే హౌస్ మేట్స్ అంతా ఆ లిస్టు కూడా చెప్పేశారు.
ముఖ్యంగా ప్రిన్స్ యావర్ కు ముగ్గురు క్రష్ లు ఉన్నారని... వారిలో మొదటి అమ్మాయి సింగర్ ధామిని, రెండో అమ్మాయి రతికా రోజ్, మూడో అమ్మాయి నయని పావని అంటూ తెలిపారు. ముఖ్యంగా కింద లైన్ లో కూర్చున్న వారంతా ఆయన బాధితులే అంటూ తేజ చెప్పుకొచ్చాడు. ఆ లైన్ లో భోలె షవాళి కూడా ఉండగా.. భోలె కూడా ప్రిన్స్ యావర్ క్రష్ యేనా అంటూ నాగార్జున ఆట పట్టించాడు. అదేం కాదని.. వాళ్లంతా తన ఫ్రెండ్స్ అంటూ యావర్ చెప్పుకొచ్చాడు. చూడాలి మరి బయటకు వచ్చాకా ఎవరితో ఎక్కువగా ఉండి ఎవరితో రిలేషన్ కొనసాగిస్తాడో.


Click it and Unblock the Notifications











