Bigg Boss Telugu 7 Finale: యావర్ తెలివైన నిర్ణయం... ఎలిమినేట్ అవుతూ ఎన్ని లక్షలు కొల్లగొట్టాడంటే?
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనల్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఆరు మంది కంటెస్టెంట్స్ ఉండగా... ముగ్గురు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక టాప్ 3 కంటెస్టెంట్స్ గా శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ మిగిలారు. టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఇప్పటి వరకు యావర్, ప్రియాంక, అర్జున్ అంబటి ఎలిమినేట్ కాగా... యావర్ ఎలిమినేట్ అవుతూ తెలివైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Recommended Video

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మరో రోజులో ముగియనుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ కంటే బెటర్ గా ప్రజెంట్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఇక చివరి ఘట్టానికి చేరుకున్న ఈ షో... ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ సారి సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. చివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. వారిని టాప్ 6 ఫైనాలిస్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ.. ఫైనాలే వరకు తీసుకుపోయారు.

ఇక రేపటి గ్రాండ్ ఫినాలే కోసం... బిగ్ బాస్ భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. పాత కంటెస్టెంట్స్ అంతా వచ్చి డాన్స్ ఫెర్మామెన్స్ లు చేయనున్నారట. ఇక వారితో పాటు సెలబ్రేటీలు సైతం వచ్చి సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. ఇక ఈ బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్ మెంట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేత అనౌన్స్ చేయించనున్నారని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేశ్ బాబును బుల్లితెరపై చూసుకోవచ్చున్నమాట.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఇప్పటికే టాప్ 6 స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యారు. ఆయన డైరెక్టుగా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత టాప్ 5 పోజిషన్ లో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయింది. ఈ భామను రవితేజ స్టేజ్ మీదకు తీసుకువచ్చి టాప్ 5 కంటెస్టెంట్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే అని అర్థం అవుతుంది.
ఇక టాప్ 4 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికి బిగ్ బాస్ గేమ్ లో ఉంటారా.. లేక రూ. 15 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేస్తారా అనే అప్షన్ ఇచ్చారంట. అయితే వీరిలో యావర్ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యావర్ మాత్రం రూ. 15 లక్షల క్యాష్ తీసుకుని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని సమాచారం లీక్ అయింది.
ఈ మేరకు సోషల్ మీడియా యావర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి పని చేశావ్ యావర్ అంటూ.. మెచ్చుకుంటున్నారు. లేదంటే ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేవాడవంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా గ్రాండ్ ఫినాలే నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మరో ముగ్గురు ఫైనల్ రేసులో ఉన్నారు. అయితే ప్రైజ్ మనీలోంచి 15లక్షలు పోగా... విన్నర్ కు మిగిలేది 35లక్షలే. మరి వీరిలో ఎవరు అది గెలుచుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











