Bigg Boss Telugu 7: గుండెలు పిండేసిన యావర్.. ఒక్క మాటతో హీరో అయ్యాడుగా.. ఈ సీజన్‌లోనే బెస్ట్ ఎపిసోడ్
ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు పరిచయం అవుతున్నాయి. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా దీనికి తెలుగు ప్రేక్షుకులు భారీ స్పందన అందించారు. దీంతో ఇప్పటి ఏడో సీజన్ వరకూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఇక, ఈ సీజన్ ఫినాలేకు చేరడంతో తాజా ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోను చూపించారు. అది ఎలా సాగిందో చూద్దాం పదండి!
టైటిల్ బరిలో ఆరుగురు : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని ఫినాలే వీక్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా ఉన్నారు. వారిలో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్‌లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లలో విజేతను నిర్ణయించే ఓటింగ్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

ఆ వీడియోలు ప్రసారం : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు చివరి వారం కావడంతో ఫైనలిస్టుల జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. సోమవారం ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్ బిగ్ బాస్ ప్రయాణాలను చూపించారు. మంగళవారం ఎపిసోడ్‌లో శివాజి, ప్రియాంక జైన్ వీడియోలను చూపించగా.. బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ జర్నీలను ప్రసారం చేశారు.
యావర్‌కు ఎలివేషన్‌తో : తాజా ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోను చూపించారు. అంతకు ముందు బిగ్ బాస్ 'యావర్.. మీరు ఎంతో మంది ప్రజల ప్రేమను పొందాలనే కోరికతో.. పరిచయం లేని మనుషుల మధ్య భాష రాకపోయినా మీలోని భావాలను అందరితో పంచుకొని.. యావర్ ఎవరో ఈ ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టారు' అంటూ ఎలివేషన్ ఇచ్చాడు.

స్పై బ్యాచ్ హైలైట్‌గా : ఆ తర్వాత బిగ్ బాస్ 'యావర్.. మీరు ఒక విషయాన్ని ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టమైనా పడతారని అందరికీ తెలిసింది. యావర్‌తో పోటీ అంటే అందరూ ఆలోచించేలా చేశారు. ఆరో వారంలోనే బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా నిలాచారు. SPY రూపంలో మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది' అని చెప్పాడు.
మీ క్యారెక్టర్ తెలిసింది : అనంతరం బిగ్ బాస్ 'యావర్.. మీ కోపం, మీ పట్టుదల మీకు తప్పు కనిపించిన ప్రతి చోటా కనిపించాయి. అది ఎవరైనా నిలదీసే ధైర్యాన్ని ఇచ్చింది. అదే మీరు ఎవిక్ష్ పాస్‌ను సాధించేలా చేసింది. మీరు దాన్ని తిరిగి ఇచ్చినప్పుడు నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది. మీరు ఇలా నిలబడ్డారంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎంత ప్రేమించారో అర్థమైంది' అన్నాడు.

చరిత్ర సృష్టించే దమ్ము : జర్నీ వీడియో తర్వాత యావర్ ఏడుస్తూ.. 'కొంతమంది నాలో చాలా కోపం ఉందని అంటారు. కానీ నాలో చరిత్ర సృష్టించే దమ్ము ఉంది. థాంక్యూ బిగ్‌బాస్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నేను లైఫ్‌లో నిలబడితే అవసరం ఉన్న వాళ్లకి సాయం చేస్తా. నాలాంటి వాళ్లను నిలబెడతానికి ప్రయత్నిస్తా' అని చెప్పాడు.
నాకు రెండో అమ్మ : ఆ తర్వాత యావర్ 'నేను హైదరాబాద్ బిడ్డ కాదు.. కోల్‌కతా బిడ్డ కాదు.. నేను నీ బిడ్డ. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నాతో బిగ్‌బాస్ పేరు కూడా ఉంటుంది. నేను ఎవరు అసలు? నథింగ్ అనుకున్న నన్ను మీరే సంథింగ్ చేశారు. ఐ లవ్ యూ బిగ్‌బాస్. మీరు నా పైన నమ్మకం ఉంచారు. అందుకే మా అమ్మ నువ్వు. నా రెండో అమ్మ. థాంక్యూ ఆడియన్స్' అని ఏడిపించేశాడు.


Click it and Unblock the Notifications











