Bigg Boss Telugu 7: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఒక్క ఎపిసోడ్‌తో తారుమారు.. అతడికి శివాజి కంటే ఎక్కువే!
తెలుగు బుల్లితెరపై రికార్డులు బ్రేక్ అయ్యేలా స్పందనను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అలా దాదాపు ఏడేళ్లుగా సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇది ఇప్పుడు పదో వారానికి చేరుకుంది. ఫలితంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వీక్ వల్ల ఓటింగ్‌లో పెను మార్పులు వచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
ఫ్యామిలీ వీక్‌తో ఎమోషన్స్:బిగ్ బాస్ సీజన్‌లో ఫ్యామిలీ వీక్ అనేది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం పాటు ఇంటికి దూరంగా ఉన్న వాళ్ల కోసం కుటుంబ సభ్యులు వచ్చి వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంటారు. ఇలా ఏడో సీజన్‌లో పదో వారంలో ఫ్యామిలీ వీక్‌ను తీసుకు వచ్చారు. ఎంతో ఎమోషనల్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్స్ వల్ల ప్రేక్షకులకు మజా దక్కుతోంది.

శోభా శెట్టి మదర్ ఎంట్రీతో:ఫ్యామిలీ వీక్‌లో భాగంగా గురువారం ఎపిసోడ్‌లో శోభా శెట్టి మదర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కూతురు కెప్టెన్ కావడంతో ఆమె వీఐపీ రూమ్ నుంచి ఇంట్లోకి అడుగు పెట్టారు. ఆమెతో పాటు ప్రిన్స్ యావర్ తల్లి ఫొటోను తీసుకొచ్చారు. ఆ సమయంలో అతడు ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. మదర్ వచ్చినప్పుడు శోభా కంటే యావర్ హైలైట్ అయ్యేలా ఇది సాగింది.
యావర్ బ్రదర్.. ఏడుస్తూ:శోభా శెట్టి మదర్ వెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రిన్స్ యావర్ బ్రదర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన రావడం రావడమే తమ్ముడిని ఆప్యాయంగా హత్తుకుని ఏడ్చేశాడు. హౌస్‌లోకి వచ్చిన అందరి కంటే ఈయన వచ్చినప్పుడు ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అంతలా యావర్ తన ప్రేమను చూపించాడు. వాళ్ల అన్నయ్య కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చి మోటివేట్ చేశాడు.

యావర్ మాత్రం హైలైట్:మొత్తంగా గురువారం జరిగిన ఎపిసోడ్‌లో అటు శోభా శెట్టి మదర్, ఇటు సోదరుడు ఎంట్రీ ఇచ్చిన సమయంలో ప్రిన్స్ యావర్ కనిపించిన తీరు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించింది. అంతలా అతడు ఎమోషనల్ అయిపోయి కనిపించాడు. మొత్తంగా నిన్నటి ఎపిసోడ్‌లో ముగ్గురు కుటుంబ సభ్యులు వచ్చినా.. అందరి కళ్లు మాత్రం ప్రిన్స్ యావర్ మీదనే పడ్డాయని చెప్పుకోవాలి.
ఐదుగురు.. ఓట్లపై ఎఫెక్టు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పదో వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా చప్పగా సాగిపోయింది. రాజమాతలు, ప్రజల కాన్సెప్టుతో నడిచిన ఈ టాస్కులో మొత్తంగా భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శివాజి, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు. ఈ వారంలో టాస్కులు లేకున్నా.. ఫ్యామిలీ మెంబర్ల ఎంట్రీని పెట్టారు. అలా కుటుంబ సభ్యుల రాకతో ఓట్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది.

యావర్‌కు భారీ ఓటింగ్:ఫ్యామిలీ వీక్‌లో భాగంగా గురువారం జరిగిన ఎపిసోడ్‌లో యమా హైలైట్ అవడంతో పాటు ప్రిన్స్ యావర్‌కు సింపతీ బాగా వచ్చింది. ఫలితంగా అతడికి ఈ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ భారీ స్థాయిలో పెరిగినట్లు తెలిసింది. అది ఎంతలా అంటే ఇప్పుడు శివాజీ కంటే అతడికే ఎక్కువ పోలింగ్ నమోదు అవుతుందట. దీంతో యావర్ ఓటింగ్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడని తెలుస్తోంది.
ఎవరు ఏ స్థానంలో అంటే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో శివాజి అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత ప్రిన్స్ యావర్ ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఇక, మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ, నాలుగో స్థానంలో బోలే షావలి, ఐదో స్థానంలో రతికా రోజ్ ఉన్నారని సమాచారం. దీంతో ఈ వారంలో చివరి ఇద్దరిలో ఒకరు వెళ్లే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











