Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్ నిరాహార దీక్ష.. హౌస్‌లో ఊహించని సీన్.. శివాజి ఊరమాస్ వార్నింగ్
వినూత్నమైన కాస్పెప్టుతో తెలుగు బుల్లితెరపై పరిచయమైనా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడంలో విజయం సాధించి నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ఇప్పటికే తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నిర్వహకులు ఏడో సీజన్‌ను కూడా మొదలెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. రాబోయే ఎపిసోడ్‌లో ఊహించని సీన్ కనిపించింది. ఆ వివరాలు మీకోసమే!
బిగ్ బాస్ షోకు తెలుగులో ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకొచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపిస్తూ మజాను పంచుతున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో కన్ఫార్మ్ కంటెస్టెంట్ అవడం కోసం ప్రతి వారం పవర్ అస్త్ర టాస్కులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నాలుగో వారానికి సంబంధించి 'బిగ్ బాస్ బ్యాంక్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో బ్యాంకర్లు అయిన శివాజి, సందీప్, శోభా శెట్టిలు హౌస్‌లోని కంటెస్టెంట్లకు కాయిన్స్ ఇచ్చారు. వాళ్లకు బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ టీమ్.. రతికా రోజ్, టేస్టీ తేజ మీద విజయం సాధించింది. దీని తర్వాత కూడా కొన్ని టాస్కులు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్, ప్రశాంత్ కలిసి బజర్ ఏరియాలోనే తింటూ కూర్చున్నారు. దీనిపై మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ గొడవను చూపించారు. ప్రిన్స్ అంత తింటున్నాడు.. ఇంత తింటున్నాడు అంటూ అతడిపై కొందరు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత శివాజి వచ్చి అతడికి మరో చపాతి కావాలంట అని అడిగాడు. దీంతో వీళ్లందరూ నిరాకరించారు. దీంతో ప్రిన్స్ వచ్చి తన చేతిలో ఉన్న ప్లేజ్‌ను కిచెన్ ఏరియాలో పడేసి ఇకపై ఇంట్లో ఏమీ తినను అంటూ వెళ్లిపోయాడు.
దీంతో ఫుడ్ వేస్ట్ చేయొద్దు అంటూ ప్రిన్స్ యావర్‌పై సందీప్ మాస్టర్, ప్రియాంక జైన్ గొడవ పడ్డారు. అప్పుడు శివాజి కల్పించుకుని ముందుగా శోభాతో, తర్వాత సందీప్‌తో గొడవ పడ్డాడు. ముఖ్యంగా జనాలు చూస్తున్నారు అంటూ శోభా, శివాజి వాదన పడి టెన్షన్ పెట్టేశారు. తర్వాత అతడు 'మంచిగా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. ఇకపై నేనేంటో చూపిస్తా' అంటూ ఊరమాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











