Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ టీం నుంచి బిగ్ లీక్.. ఈసారి ఎవిక్షన్ పాస్ పొందే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షో పదకొండో వారంలోకి అడుగు పెట్టి దూసుకెళ్తోంది. అయితే గేమ్ పూర్తయ్యే సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బిగ్ బాస్ రేటింగ్ కోసం మరింత అదిరే టాస్క్ లు ఇస్తున్నాడు. ముఖ్యంగా పదో వారం ఫ్యామిలీ వీక్ నిర్వహించి అందరినీ అలరించగా.. ఈ వారం ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ లు ఇస్తూ రచ్చ చేస్తున్నాడు. ఈ ఎవిక్షన్ పాస్ కోసం ఇంట్లో అద్భుతమైన పోటీ వాతావరణం నెలకొంది. ముందుగా కంటెస్టెంస్టకు 1 టు 10 ర్యాంకింగ్స్ తీసుకొమ్మని చెప్పి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ షోను రసవత్తరంగా మార్చుతున్నాడు.
అయితే ఈ టాప్ 10 ర్యాంకింగ్స్ లో టాప్ 1లో శివాజి, 2లో ప్రిన్స్ యావర్, 3లో పల్లవి ప్రశాంత్, 4లో ప్రియాంక జైన్, 5లో శోభా శెట్టి, 6లో అమర్ దీప్, 7లో గౌతమ్ కృష్ణ, ఎనిమిదిలో అంబటి అర్జున్, 9లో అశ్విని, 10లో రతికా రోజ్ లను నిలబెట్టారు. ఈక్రమంలోనే కంటెస్టెంట్లు బాటమ్ ఐదుగురికి ఎవిక్షన్ పాస్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పాడు. ఇలా అమర్ దీప్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్, అశ్వినిలు ఓ టాస్క్ ఆడారు. ఇందులో అంబటి అర్జున్ గెలిచాడు. ఇక ఈరోజుటి ప్రోమోలో.. ఎవిక్షన్ పాస్ టాస్క్ ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పుడే ప్రారంభం అయిందంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

టాప్ 5 లో ఉన్న వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఆడాలని సూచించగా.. యావర్ ను కోరాడు అర్జున్. ఇలా యావర్ తో పోటీ పడి అర్జున్ ఓడిపోయాడు. ఇలా గెలిచిన యావర్ కు మిగిలిన నలుగురితో పోటీ పడాలని చెప్పాడు. రెండో టాస్క్ లో భాగంగా యావర్ శివాజి, ప్రియాంక జైన్ లతో బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో పాల్గొనాల్సి వచ్చింది. అయితే ఇందులో శివాజి, ప్రియాంక జైన్ ఓడిపోయినట్లు రెండో ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ఇలా వీరిద్దరూ ఎవిక్షన్ పాస్ నుంచి ఎలిమినేట్ కాగా.. మిగిలింది ఇక ముగ్గురే.
అయితే ఈ ముగ్గురిలో ఒకటి యావర్, రెండో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మూడోది శోభా శెట్టి. అయితే పల్లవి ప్రశాంత్ కు, యావర్ కు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో స్కూటీలకు నెంబర్ ప్లేట్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ టాస్కులో రైతుబిడ్డతో తలబడిన పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు. ఇలా చివరి టాస్క్ లో భాగంగా శోభా శెట్టితో పల్లవి ప్రశాంత్ పోటీ పడ్డాడు. డైస్ తో నెంబర్లు వేసుకుంటూ బర్గర్ తినే ఈ గేమ్ లో యావర్ ముందుగా టాస్క్ కంప్లీట్ చేసినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థం అయింది. అలాగే బర్గర్లు తినలేని శోభా శెట్టి వాంతి చేసుకుంటూ బాత్రూంలోకి పరిగెట్టడం మనం చూడవచ్చు.

ఇలా అన్ని టాస్కులు పూర్తి చేసి ప్రిన్స్ యావర్ గెలుపొందినట్లు ప్రోమోలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నది ఎవరో లీక్ అయింది. ముఖ్యంగా తాజా సమాచారం ప్రకారం ప్రిన్స్ యావరే ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ మోస్ట్లీ ప్రిన్స్ యావర్ యే ఎవిక్షన్ పాస్ గెలుచుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఈరోజుటి ఎపిసోడ్ తో మనకు పూర్తిగా విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











