Bigg Boss Telugu 7: ప్రశాంత్ చేతిలో సూపర్ పవర్.. శివాజిని పంపేందుకు ప్లాన్.. యావర్ సంచలన నిర్ణయం
చాలా తక్కువ సమయంలోనే తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ షోగా మారిపోయింది బిగ్ బాస్. అందుకు తగ్గట్లుగానే ఇది దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా మారిపోయింది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇందులో చిత్ర విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ స్పెషల్ పవర్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!
నిజంగా ఉల్టా పుల్టా సీజనే:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను మొదలెట్టే ముందు దీన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతామని నిర్వహకులు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఎవరూ ఊహించని కంటెంట్‌తో రసవత్తరంగా ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కొత్త కొత్త టాస్కులు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను చూపిస్తూ మజా పంచుతున్నారు. ఫలితంగా ఈ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

యావర్ వెనక్కి ఇచ్చేశాడు:ప్రతి సీజన్‌లోనూ పదో వారం దాటిన తర్వాత కంటెస్టెంట్లకు బిగ్ బాస్ 'ఎవిక్షన్ పాస్' టాస్కును ఇస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇది గెలిచిన వాళ్లు ఒక వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ పవర్ కోసం అందరూ ఆరాటపడుతుంటారు. ఈ సీజన్‌లో దీన్ని ప్రిన్స్ యావర్ గెలిచాడు. కానీ, అతడు తప్పు చేసినట్లు తేలడంతో తిరిగి ఇచ్చేశాడు.
అందరికీ కలిపి ఆ టాస్కు:గత వారంలో ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేయడంతో 12వ వారంలో దీన్ని మరోసారి నిర్వహించారు. అయితే, ఈ సారి హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లకు 'బ్యాలెన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ చెప్పిన వస్తువులను ఒక వైపు పెట్టి.. మరో వైపు నుంచి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆరో సీజన్‌లోనూ ఈ టాస్కును పెట్టగా ఆది రెడ్డి గెలిచాడు.

పాస్‌ను గెలిచిన ప్రశాంత్:ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగిన బ్యాలెన్స్ టాస్కులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే శివాజి చేయి నొప్పి రావడంతో వదిలేసి ఔట్ అయ్యాడు. చివరికి అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ చాలా సేపు బ్యాలెన్స్ చేసి ఆడారు. అప్పుడు అశ్విని ఔట్ అయింది. ఆ తర్వాత ప్రియాంక కూడా ఓడిపోయింది. దీంతో ప్రశాంత్ పాస్‌ను గెలుచుకున్నాడు.
గాడ్ గిఫ్టెడ్.. శివాజి హ్యాపీ:అందరి కంటే ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేయడంతో పల్లవి ప్రశాంత్ ఈ టాస్కులో గెలిచి ఎవిక్షన్ పాస్‌ను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ప్రకటించిన వెంటనే శివాజి అరుచుకుంటూ వెళ్లి అతడికి హగ్ ఇచ్చేశాడు. అంతేకాదు, 'నువ్వు గాడ్ గిఫ్టెడ్ రా. నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

నువ్వు త్యాగం చేశావన్నా:శివాజి మాటలతో పల్లవి ప్రశాంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ సమయంలోనే 'నువ్వు నాకోసం లెటర్ త్యాగం చేసినప్పుడే నాకు అర్థం అయింది అన్నా. నేను దేని కోసం వచ్చానో అని తెలిసింది అన్నా. నా గురించి నీకు మాత్రమే తెలుసు. నువ్వే నన్ను నమ్మావు. దాన్ని నిలబెట్టుకుంటాను' అని శివాజికి వివరించాడు.
యావర్ గొప్ప నిర్ణయం:ప్రశాంత్ 'ఎవిక్షన్ పాస్'ను గెలిచిన తర్వాత అతడితో శివాజి, ప్రిన్స్ యావర్ చర్చించారు. అప్పుడు ప్రిన్స్ 'ప్రశాంత్ నీకు ఒకటి చెప్తున్నా. ఎవిక్షన్ పాస్‌ను నువ్వు శివాజి అన్న కోసం వాడాలంటే వాడు. కానీ, నాకోసం అయితే అస్సలు వద్దు' అన్నాడు. ఇలా శివాజిని ఫినాలేకు పంపే ప్లాన్ చేస్తూ.. తనకు వాడొద్దని ధైర్యంగా చెప్పి దటీజ్ యావర్ అనిపించుకుంటున్నాడు


Click it and Unblock the Notifications











