Bigg Boss Telugu 7: యావర్ చేతి నుంచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోయింది... ఇది కదా ఉల్టా పుల్టా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక వీకెండ్ ఎపిసోడ్ కు అంతా సిద్ధం అయింది. అయితే ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారింది. దానికి కారణం ఎలిమినేషన్ ఎవరు అవుతారు.. ఆ ఎవిక్షన్ పాస్ ఎలా వాడుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. యావర్ చేతి నుండి ఎవిక్షన్ పాస్ చేజారి పోయినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది.. ఆ పాస్ ఎవరికి ఉపయోగించాడు.. ఎవరు తీసుకున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 11వ వారం కూడా పూర్తి కావొస్తుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వస్తే... హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా.. ఆ వారం జరిగిన గొడవలు, పంచాయితీలు మరిచిపోయి.. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఫుల్ మేకప్, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని నాగార్జున ముందు కూర్చొంటారు. ఇక నాగార్జున కూడా హౌస్ లో జరిగిన వారం ముచ్చట అంతా తీసి.. సండే ఫన్ డే అంటూ కబుర్లు చెప్తాడు. ఇక ఈ వారం నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.

Prince Yawar returned the eviction pass to Bigg Boss Telugu 7 Full Details Here

శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ వారంలో జరిగిన గొడవల గురించి నాగార్జున అందరి మీద పైర్ అవుతారట. అంతే కాదు.. అశ్వినీ బాటీల్ ఓవర్ యాక్షన్ గురించి కూడా మాట్లాడుతారట. ప్రియాంక, అశ్వినీ మధ్య బాటిల్ వార్ జరిగిన విషయం తెలిసిందే. ప్రియాంక.. అశ్విని తలపై బాటిల్ తో నామినేషన్స్ లో భాగంగా కొడితే.. మెల్లిగా కొట్టవచ్చు కదా.. ఎందుకు నా మీద అంత కోపం అంటూ కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తుంది.

ఇక ఆ విషయాన్ని నాగార్జున స్టేజ్ మీద గుర్తు చేస్తూ... తన చేతిపై కొట్టుకుంటాడు. నాకేం కాలేదు అంటూ అశ్వినీకి క్లాస్ పీకుతాడు. ఇక శివాజీకి కూడా ఈ వారం కొటింగ్ బాగానే పడిందట. ప్రియాంకను ఆటలు బాగా ఆడావ్ అంటూ మెచ్చుకున్నాడు నాగార్జున. ఇక మరోవైపు హౌస్ లో అందరికి నాగార్జున క్లాస్ పీకాడని తెలుస్తోంది. బాటిల్స్ పగుల గొట్టి మరీ అందరికీ గట్టిగానే తలంటాడు అని తెలుస్తోంది. ఇక దాంతో పాటు హౌస్ లో కొన్ని గేమ్స్ కూడా పెట్టారట.

Prince Yawar returned the eviction pass to Bigg Boss Telugu 7 Full Details Here

మరోవైపు యావర్ ఛీటింగ్ గేమ్ ఆడి.. ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుచుకున్నాడు అంటూ నాగార్జున తేల్చుతాడు. ఏదో వీడియో ప్లే చేసి మరీ హౌస్ లోని అందరికీ చూపిస్తాడు. దీంతో ఆ పాస్ కు నేను అనర్హుడిని.. అంటూ బిగ్ బాస్ కు తిరిగి ఇచ్చేస్తాడు యావర్. అలా యావర్ చేతి నుంచి ఆ పాస్ చేజారి పోతుంది. ఇక ఆ ఎవిక్షన్ పాస్ ను స్టోర్ రూమ్ లో పెట్టారట.

Prince Yawar returned the eviction pass to Bigg Boss Telugu 7 Full Details Here
మరి దాన్ని బిగ్ బాస్ ఎలా యూజ్ చేస్తాడు.. ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి శనివారం షూటింగ్ పూర్తి అయింది. ఆది వారం షూటింగ్ జరుగుందని తెలుస్తోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. చాలా వరకు అశ్విని అని టాక్ వినిపిస్తుంది. ఓటింగ్ లో ఈ భామకు తక్కువగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X