Bigg Boss Telugu 7: ప్రిన్స్ యావర్ మగాడ్రా బుజ్జి.. షో చరిత్రలో ఒకే ఒక్కడు.. నాగార్జునకే బిగ్ ఝలక్

సాధారణంగా బుల్లితెరపై వచ్చే షోలకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ, వాటన్నింటినీ దాటేసి మరీ కొత్త కంటెంట్‌తో వస్తున్న కార్యక్రమమే బిగ్ బాస్. అసలు ఏమాత్రం ఊహించని కాన్సెప్టుతో వచ్చిన ఇది.. అనతి కాలంలోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్ తాను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్‌ను రిటర్న్ ఇచ్చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

Prince Yawar Returns His Eviction Pass to Bigg Boss

ర్యాంక్స్.. ఎవిక్షన్ పాస్ టాస్క్: ఉల్టా పుల్టాగా సాగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించి కంటెస్టెంట్లు అందరి కోసం ర్యాంకుల టాస్క్ ఇచ్చారు. ఇందులో వచ్చిన ఫలితం ఆధారంగా ఆ తర్వాత 'ఎవిక్షన్ పాస్' టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మూడు రౌండ్లలో అర్జున్, ప్రశాంత్, శోభాలపై గెలిచిన ప్రిన్స్ యావర్.. చివరి పోటీలో శివాజి, ప్రియాంక జైన్‌తో టాస్కును ఆడాడు.

హైడ్రామాల నడుమ విన్నర్: ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్ ఎన్నో హైడ్రామాలతో సాగింది. ముఖ్యంగా ఈ టాస్క్ నుంచి ప్రియాంక, శివాజిలు వరుసగా ఔట్ అయ్యారు. దీంతో ప్రిన్స్ ఈ టాస్కులో గెలిచాడని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడే బిగ్ బాస్ నియమాల ప్రకారం గెలిచింది ఎవరో చెప్పాలన్నాడు. దీంతో శోభాకు శివాజికి గొడవ జరిగింది. చివరకు ప్రిన్స్ యావర్‌ను విన్నర్‌గా ప్రకటించారు.

నాగార్జున వీడియోలు చూపి: ఎవిక్షన్ పాస్ గెలిచిన సంతోషంలో ఉన్న ప్రిన్స్ యావర్‌కు శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున బిగ్ షాక్ ఇచ్చాడు. ముందుగా అతడిని ఆ పాస్‌ను తీసుకుని రమ్మని చెప్పిన హోస్ట్.. ఆ తర్వాత కొన్ని వీడియోలను చూపిస్తా అన్నాడు. అలా అర్జున్‌తో ఆడింది, చివరి రౌండ్ వీడియోలను చూపించారు. వాటిలో ప్రిన్స్ యావర్ మిస్టేక్స్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది.

తప్పు జరిగింది.. అలా కాదు: ప్రిన్స్ యావర్ మిస్టేక్ చేసిన వీడియోలను చూసిన తర్వాత అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో అతడు 'సార్ గెలవాలన్న ఉద్దేశంతో నేను మిస్టేక్ చేశాను. కానీ, కావాలని చేయలేదు. బాల్స్ టాస్కులో మాత్రం నాకు అర్థం అవలేదు' అని చెప్పాడు. దీంతో హోస్ట్ నాగార్జున 'యావర్.. గెలవడం ముఖ్యమే కానీ.. అది ఎలా గెలిచామన్నది ఇంకా ముఖ్యం' అన్నాడు.

ఇది నాకు వద్దు సార్ అంటూ: నాగార్జున మాటలకు తన తప్పును ఒప్పుకున్న ప్రిన్స్ యావర్ 'ఒకవేళ నేను ఎవిక్షన్ పాస్ తీసుకోడానికి అనర్హుడిని అనుకుంటే ఇది నాకు వద్దు సార్' అన్నాడు. అప్పుడాయన 'అది నేను కాదు.. నువ్వు చెప్పాలి యావర్' అన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ 'అయితే ఇది నాకు వద్దు సార్' అనేశాడు. దీంతో నాగార్జునతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

హౌస్‌లో ముగ్గురు వద్దంటూ: ప్రిన్స్ యావర్ తనకు ఎవిక్షన్ పాస్ వద్దని హోస్ట్ నాగార్జున ముందే నిర్భయంగా చెప్పడంతో.. 'సరే యావర్.. ఇప్పుడు హౌస్ డెసీషన్ తీసుకుందాం' అని అతడు అనర్హుడు అనే వాళ్లు ఓట్లు వేయమన్నాడు. అప్పుడు శోభా శెట్టి, అమర్‌దీప్, ప్రియాంకలు మాత్రమే అతడు డిజర్వ్ కాదని చేతులు లేపారు. దీంతో ఎక్కువ శాతం మంది ప్రిన్స్ అర్హుడే అని ఒప్పుకున్నారు.

నాకు క్యారెక్టరే ముఖ్యం అని: ఇంటి సభ్యులు తనకు సపోర్ట్ చేసినా ప్రిన్స్ యావర్ మాత్రం ఎవిక్షన్ పాస్ వద్దన్నాడు. దీంతో నాగార్జున దాన్ని స్టోర్ రూంలో పెట్టమన్నాడు. ఆ తర్వాత ఆయన 'యావర్.. ఎవిక్షన్ పాస్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు' అన్నాడు. దీనికి ప్రిన్స్ 'అవును సార్.. కానీ అంతకంటే ముఖ్యం నా క్యారెక్టర్ సార్' అన్నాడు. దీంతో నాగ్ 'అందుకే నీ నిర్ణయాన్ని ఒప్పుకున్నాం' అన్నాడు.

వాడు మగాడ్రా బుజ్జి అని: నాలుగు రౌండ్ల పాటు కష్టపడి ఆడి గెలుచుకున్న ఎవిక్షన్ పాస్‌ను ప్రిన్స్ యావర్ వెనక్కి ఇచ్చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఫినాలేకు ముందు ఎలిమినేషన్ నుంచి కాపాడే పాస్‌ను క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని భావించి వదులుకోవడంతో యావర్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్, నాగార్జునకే షాక్ ఇచ్చిన అతడి తీరుపై వాడు మగాడ్రా బుజ్జి అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X