Bigg Boss 7 Telugu: చేతిలో రూ. 100 లేవు.. రెండు ప్యాంట్లతో షోలోకి.. పాపం ప్రిన్స్ రియల్ స్టోరీ ఇదా!
బిగ్ బాస్... తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని రియాలిటీ షో ఇది. అంతలా దీన్ని ఓన్ చేసేసుకున్నారు ఇక్కడి ఆడియెన్స్. అందుకే గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అందుకే ఈ షో తెలుగులో ఏకంగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులోకి వచ్చిన ప్రిన్స్ యావర్ తన లైఫ్ స్టోరీతో అందరినీ ఏడిపించాడు. వివరాల్లోకి వెళ్తే...
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వచ్చింది. దీంతో ఆరంభం నుంచే ఇది అందరి మన్ననలు పొందుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ప్రిన్స్ యావర్ యమ హైలైట్ అయ్యాడు. బాడీ, డ్రెస్సింగ్, భాషతో బాగా ఫోకస్ అయ్యాడు. దీనికితోడు ఆట పరంగానూ మెప్పిస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఏడో సీజన్‌కు సంబంధించి రెండో వారంలో జరిగిన టాస్కుల్లో ప్రిన్స్ యావర్ అదరగొట్టేశాడు. కానీ, అతడిని గౌతమ్ పవర్ అస్త్ర పోటీదారుల నుంచి తప్పించాడు. దీంతో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఇక, మూడో వారంలో కూడా అతడు అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా స్టాండ్ దగ్గర నిల్చుని ఆడిన టాస్కుతో ప్రిన్స్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.
ఈ వారం ఎన్నో ట్విస్టుల మధ్య మూడో పవర్ అస్త్ర కోసం చివరికి ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పోటీదారులుగా నిలిచారు. వీళ్లకు శుక్రవారం ఎపిసోడ్‌లో ఓ టాస్క్ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరు వీక్ కంటెస్టెంటో మెజారిటీ సభ్యులు తేల్చేసి.. వాళ్ల బొమ్మను పగలగొట్టాలని చెప్పాడు. దీంతో శోభా శెట్టి, ప్రియాంక కలిసి ప్రిన్స్‌ను ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసేశారు.
ఎంతో కష్టపడి ఆడినప్పటికీ తనను ఎలిమినేట్ చేయడంతో ప్రిన్స్ యావర్ తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో మొదటి శోభా శెట్టితో, తర్వాత ప్రియాంక జైన్‌తో గొడవలు పెట్టుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న తన బొమ్మను పగలగొట్టడంతో పాటు దాన్ని ఉంచిన టేబుల్‌ను సైతం బద్దలయ్యేలా కొట్టాడు. దీంతో అందరూ అతడి ప్రవర్తనను చూసి భయపడిపోయారు.
ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత ప్రిన్స్.. శివాజి ముందు తన బాధను చెప్పుకున్నాడు. 'నేను బిగ్‌బాస్‌లోకి లోన్ తీసుకొని వచ్చాను సార్. నాకు ఆకలి బాధ ఉంది సార్. ఇది అగ్రెషన్ కాదు. నాకు ఉద్యోగం లేదు. ఒకప్పుడు 100 రూపాయల కూడా లేవు సార్. నాకు ఇప్పటికీ రెండు మూడు ప్యాంట్స్ మాత్రమే ఉన్నాయి సార్. ఇక్కడ వాటినే వాష్ చేసుకొని వేసుకుంటాను. ఎంత మంచిగా ఆడినా నాకు సరైన న్యాయం జరగడం లేదు సార్' అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇది చూసిన ఆడియెన్స్ కళ్లు కూడా చెమర్చాయి.


Click it and Unblock the Notifications











