Bigg Boss 7 Telugu: షోలో హైలైట్ సీన్.. హీరోగా మారిన ప్రిన్స్ యావర్.. గుండెలు పిండేశాడు భయ్యా!

తెలుగులో ప్రసారం అయిన ప్రతిసారీ అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది బిగ్ బాస్ షో. దేశంలోని చాలా భాషల్లో వస్తోన్న ఈ షో.. మన దగ్గర మాత్రమే వాటన్నింటినీ మించిన రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కనిపించాయి. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ హీరోగా మారిపోయాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును ఐదో వారంలో తెచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిలో అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. వీళ్లకు కొన్ని టాస్కులు ఇవ్వగా.. గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో తక్కువ స్టార్లు ఉన్న శోభా, ప్రియాంక టీమ్‌ను డిస్‌క్వాలిఫై చేశారు.

Bigg Boss Telugu 7

కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్‌లో భాగంగా నాలుగు టీమ్‌లకు 'చిట్టీ ఆయేగా' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో జంటలకు వాళ్ల ఫ్యామిలీలు లేదా ఇష్టమైన వాళ్ల నుంచి లెటర్స్ వస్తాయి. అయితే, ఇందులో ఒకరు లెటర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారు అవకుండానే ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఇది అంతా ఎమోషనల్‌గా నడిచింది.

ఈ టాస్కులో భాగంగా 'చిట్టీ ఆయేగా' మొదటిసారి గౌతమ్ కృష్ణ, శుభశ్రీ జంట లోపలికి వెళ్లింది. అందులో వీళ్లిద్దరూ లెటర్లను చూసి ఎమోషనల్ అయ్యారు. లెటర్ నాకు కావాలంటే నాకు కావాలంటూ కాసేపు వాదించుకున్నారు. చివరకు గౌతమ్ కృష్ణ కాస్త కోప్పడ్డాడు. దీంతో శుభశ్రీ తన లెటర్‌ను కంటెండర్‌షిప్‌ను త్యాగం చేసింది. దీంతో అతడు పోటీదారుగా నిలిచాడు.

Prince Yawar Sacrifices His Letter for Tasty Teja In Captaincy Task

'చిట్టీ ఆయేగా' టాస్కులో రెండో రౌండ్‌లో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్‌ల వంతు వచ్చింది. అప్పుడు తేజ 'నాకూ లెటర్, కంటెండర్‌షిప్ అవసరమే. కానీ, యావర్ గాడు ఐదు వారాల నుంచి ఇమ్యూనిటీ కోసం శ్రమిస్తున్నాడు. అందుకే వాడికి ఇద్దామని అనుకుంటున్నా' అన్నాడు. అయితే, యావర్ మాత్రం 'ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండే క్యారెక్టర్ నాది కాదురా' అన్నాడు.

'చిట్టీ ఆయేగా' టాస్కులో గౌతమ్ కృష్ణ, శుభశ్రీ కంటెండర్‌షిప్ కోసం త్యాగం చేయడానికి వెనకడగా.. టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ ఇద్దరూ త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో నేను తప్పుకుంటా అంటే నేను తప్పుకుంటా అంటూ పట్టుబడ్డారు. చివరకు టేస్టీ తేజ తన లెటర్‌ను ప్రిన్స్ యావర్‌కు ఇచ్చి దాన్నే క్రషర్ మెషీన్‌లో పెట్టి తనను డిస్‌క్వాలిఫై చేయమని చెప్పాడు.

రెండు లెటర్లను తీసుకున్న ప్రిన్స్ యావర్.. టేస్టీ తేజది కాకుండా తన దానినే మెషీన్‌లో పెట్టేశాడు. దీంతో ఈ టాస్క్ నుంచి స్వయంగా తానే తప్పుకున్నాడు. ఫలితంగా టేస్టీ తేజకు లెటర్‌తో పాటు కెప్టెన్సీ టాస్క్ కంటెండర్‌షిప్ కూడా లభించింది. ఇక, ఈ టాస్కులో ప్రిన్స్ చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో అతడిని హీరోగానూ మార్చేసిందని చెప్పాలి. నాలుగు వారాల పాటు ఇమ్యూనిటీ కోసం చాలా కష్టపడ్డ అతడు.. ఎమోషనల్‌గా కనిపిస్తూ త్యాగం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X