Bigg Boss Telugu 7 Week 10th Nominations సెల్ఫ్ నామినేషన్‌తో యావర్.. నామినేషన్‌లో 5 గురు టాప్ కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 10వ వారం నామినేషన్ల ప్రక్రియ ఎప్పటిలానే గొడవలు, గందరోగోళం మధ్య మొదలైంది. రెగ్యులర్ నామినేషన్ ప్రక్రియ మాదిరిగా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్‌గా నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ సందర్భంగా యావర్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. తాజా నామినేషన్ల ప్రక్రియ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 నామినేషన్ల ప్రక్రియలో ఇంటిలోని లేడీ కంటెస్టెంట్లను రాజమాతలుగా నిర్ణయించారు. రాజ దర్బార్ సెట్ వేసి.. నలుగురిని సింహాసనాలపై కూర్చొబెట్టి నామినేషన్ల పక్రియను ప్రారంభించారు. కంటెస్టెంట్లు చేతికి కత్తి ఇచ్చి రాజమాతల సమక్షంలో నామినేట్ చేయమని బిగ్‌బాస్ ఆదేశించారు.

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మరోసారి అమర్ దీప్, భోలే షవాలీ మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే గౌతమ్, అంబటి అర్జున్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. అయితే నలుగురు రాజమాతల్లో శోభాశెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి అమర్ దీప్ వాదన సరైందని చెప్పారు. అయితే నలుగురి ఏకాభిప్రాయం తర్వాత భోలేను నామినేట్ చేశారు. అయితే నామినేషన్‌ను భోలే అంగీకరించాడు.
రతిక ఎక్కువనా? బిగ్‌బాస్ ఎక్కువనా? అంటూ అమర్ దీప్‌ను నామినేట్ చేసేందుకు ప్రిన్స్ యావర్ ప్రయత్నించాడు. రతికతో హైప్ కోసం తిరుగుతున్నానని చెప్పావు అందుకే నేను నిన్ను ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాను అని యావర్ అన్నాడు. అయితే యావర్ నామినేషన్ పాయింట్‌ను అంగీకరించకుండానే నీ నామినేషన్ అంగీకరిస్తాను అని అమర్ దీప్ అన్నాడు.

అయితే గౌతమ్ కృష్ణను నామినేట్ చేస్తూ ప్రశాంత్ తన కారణాలను చెప్పాడు. కెప్టెన్‌గా, సంచాలక్‌గా నీవు తప్పులు చేశావు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను. అంతే కాకుండా వేరే కంటెస్టెంట్ చెప్పిన విషయాలను విని ప్రభావితం అయ్యావు అంటూ ప్రశాంత్ పల్లవి తప్పును ఎత్తి చూపాడు. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టు రాజమాతలు ప్రకటించారు.

అయితే 10వ వారం నామినేషన్ ప్రక్రియ సందర్బంగా యావర్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. కొన్ని వాదనల తర్వాత నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకొంటున్నాను అంటూ యావర్ ప్రకటించాడు. దాంతో ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే ట్విస్టును బిగ్‌బాస్ ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 10వ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ వారం మొత్తం 5 గురు కంటెస్టెంట్లను నామినేట్ అయ్యారు. భోలే షవాలీ, శివాజీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం అందరూ నామినేసన్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











