Bigg Boss 7 Telugu: నాగార్జునకే షాకిచ్చిన కంటెస్టెంట్.. వీకెండ్ ఎపిసోడ్‌లో ఇది గమనించారా?

తెలుగులో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని.. దేశంలోనే ఏ షోకూ రాని రేటింగ్‌ను అందుకుంటోంది బిగ్ బాస్. ప్రతి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయినా ఆరోది మాత్రం ఆశించి రీతిలో సాగలేదు. దీంతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. దీంతో రేటింగ్ కూడా భారీగా దక్కింది.

గత వారంలో 'మాయ అస్త్ర' టాస్కులో గెలిచిన రణధీర టీమ్ సభ్యుల్లో 'పవర్ అస్త్ర' కోసం జరిగే పోటీకి ఎవరు అర్హులో చెప్పాలని మహాబలి టీమ్‌కు టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో వాళ్లు విఫలం అవడంతో టాస్క్ రచ్చ రచ్చగా సాగింది. ముఖ్యంగా ఇందులో చక్కగా ఆడినా తనను ఎలిమినేట్ చేయడంతో ప్రిన్స్ యావర్ తట్టుకోలేకపోయాడు.

 Prince Yawar Straight Question to Nagarjuna in Bigg Boss 7 Telugu Show

గౌతమ్ తనను టాస్క్ నుంచి తప్పించడంతో ప్రిన్స్ యావర్ రగిలిపోయాడు. దీంతో ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు వెళ్లి నెట్టుకున్నంత పని చేశారు. ఇది అయిపోయిన తర్వాత అతడు చాలా సేపు ఏడ్చేశాడు. తనకు న్యాయం చేయాలని అరిచాడు. ఆ తర్వాత తనను ఇంటికి పంపించమని, లేదంటే మాట్లాడను అంటూ మైక్ తీసి పడేశాడు. దీంతో బిగ్ బాస్ ప్రిన్స్‌ను పిలిచి సర్ధి చెప్పాడు.

ఇక, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున.. ప్రిన్స్ యావర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. లాస్ట్ వీక్ జరిగిన అన్ని టాస్కుల్లోనూ చక్కని ఆటతీరుతో అదరగొట్టేశావని అభినందించాడు. కానీ, హౌస్ నుంచి వెళ్లిపోతా అని అనడంపై మాత్రం అతడిని నాగార్జున మందలించాడు. అలాగే, గౌతమ్ కృష్ణతో ప్రిన్స్ యావర్‌కు క్షమాపణలు కూడా చెప్పించాడు.

ఇదంతా జరిగిపోయిన తర్వాత ప్రిన్స్ యావర్ 'సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి పర్మీషన్ ఇస్తారా' అని నాగార్జునను అడిగాడు. దీనికి ఆయన ఓకే చెప్పడంతో అక్కడే ఉన్న శివాజి పవర్ అస్త్రాన్ని చూపిస్తూ.. 'సార్ ఇది గెలవాలంటే ఇంకేం చేయాలి చెప్పండి' అంటూ సూటిగా ప్రశ్నించి హోస్టుకే ప్రిన్స్ యావర్ షాకిచ్చాడు. దీంతో అందరూ నోరెళ్లబెట్టేశారు.

ప్రిన్స్ యావర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.. 'ప్రిన్స్ ఆ టాస్క్ గెలవాలంటే నువ్వు ఆటలో గెలవడమే కాదు.. అక్కడున్న మనుషులను కూడా గెలవాలి. అలా గెలిస్తేనే పవర్ అస్త్రతో పాటు టైటిల్ కూడా మీ సొంతం అవుతుంది' అని చెప్పాడు. దీంతో ప్రిన్స్ 'నాకు బాధగా అనిపించింది. అందుకే అడిగాను ఏమీ అనుకోవద్దు సార్' అంటూ దీన్ని ముగించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X