Bigg Boss 7 Telugu: హీరోగా మారిన కంటెస్టెంట్.. ఏం గుండెరా నాయనా.. షో చరిత్రలోనే భయంకరమైనది ఇదే!
ఎవరూ ఊహించని ట్విస్టులతో సాగుతూ.. ప్రేక్షకులకు దాదాపు పదిహేను వారాల పాటు మజాను పంచుతూ సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులో మాత్రమే సూపర్ సక్సెస్ అయిన ఈ షో.. వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని నిర్వహకులు మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తున్న ఇది.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూనే వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో ఓ భయంకరమైన టాస్క్ పెట్టారు. ఆ వివరాలను మీరే చూసేయండి!
మూడో వారానికి సంబంధించి పవర్ అస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ముగ్గురు కంటెస్టెంట్లు బాగా సంబరపడిపోయారు. ఆ తర్వాత హౌస్‌మేట్లను పిలిచి అందులో అనర్హులు ఎవరో చెప్పాలంటూ మెలిక పెట్టాడు. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్ తమకు నచ్చని వాళ్ల పేర్లు చెప్పారు.

కన్‌ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్లు వేసిన ఓట్లు, వాళ్లు చెప్పిన కారణాలను బిగ్ బాస్ హౌస్‌లోని స్క్రీన్‌లో చూపించాడు. ముందుగా ప్రిన్స్ యావర్‌కు సంబంధించిన ఓటింగ్‌ను ప్లే చేశాడు. అది చూసిన తర్వాత అతడిలో కోపం పెరిగి సైకోలా ప్రవర్తించాడు. ఇక, తనను చాలెంజ్ చేసిన వాళ్లను గెలవాలని ప్రిన్స్‌కు బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఒక టాస్కును ఇచ్చాడు.
వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్లు తప్పు అని నిరూపించడం కోసం ప్రిన్స్ గార్డెన్ ఏరియాలో ఉంచిన ఓ స్టాండ్‌పై తన గడ్డాన్ని (చిన్) ఆనించి ఉంచాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే అతడిని చాలెంజ్ చేసిన దామిని, తేజ, రతికలు ఏం చేసినా ప్రిన్స్ కదలకుండా ఉండాలని చెప్పాడు. అంతేకాదు, ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే భయంకరమైన టాస్క్ అని చెప్పాడు.
ఈ టాస్కులో భాగంగా ప్రిన్స్ స్టాండ్‌పై గడ్డాన్ని ఆనించి ఉండగా.. దామిని, రతికా, టేస్టీ తేజ వచ్చి అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. ముఖంపై గుడ్డు కొట్టడం, ముక్కులో భామ్ పెట్టడం, శాంపూ నురగను కళ్లలో పోయడం, డ్రాయర్‌లో ఐస్ ముక్కలు వేయడం, పేడను నోట్లో పెట్టడం, గడ్డిని ఒంటి నిండా నొక్కడం వంటివి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అతడికి నరకం చూపారు.
ముగ్గురు కలిసి చిత్ర హింసలు పెడుతున్నా ప్రిన్స్ యావర్ మాత్రం తట్టుకుని నిలబడ్డాడు. ఒక సందర్భంలో దామిని పదే పదే అతడి ముక్కులోకి నీళ్లు కొడుతుంటే ఊపిరి ఆడక విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో గడ్డం పైకి లేపాడని శివాజి అన్నాడు. కానీ, సందీప్ మాస్టర్ మాత్రం మొత్తం లేపలేదని చెప్పడంతో ప్రిన్స్ టాస్కును కంటిన్యూ చేశాడు.
మొత్తానికి దాదాపు గంటకు పైగానే ఈ టాస్క్ జరగ్గా ప్రిన్స్ యావర్ ఎంతో ఓపికగా వ్యవహరించి గెలిచాడు. తద్వారా ఈ వారం జరిగే పవర్ అస్త్ర టాస్కులో పోటీదారుడిగా నిలిచాడు. అంతేకాదు, మొన్నటి ఎపిసోడ్‌లో విచిత్రంగా ప్రవర్తించి సైకో అనిపించుకున్న అతడే.. నిన్నటి టాస్కులో గెలిచి హీరోగా మారాడు. ఇక, ఈ టాస్కులో అతడి ఆటతీరును చూసిన వాళ్లంతా 'నీది ఏం గుండెరా నాయనా' అంటూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











