Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సైకో.. గ్లాస్ పగలగొట్టే ప్రయత్నం.. భయంతో కంటెస్టెంట్ల పరుగు
సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటోంది. దీంతో అత్యధిక రేటింగ్ కూడా లభిస్తోంది. అయితే, గత సీజన్ ఆశించిన రీతిలో సక్సెస్ కాకపోవడంతో బిగ్ బాస్ ఇప్పుడు ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో ఊహించని కంటెంట్‌ను చూపిస్తూ అంతకంతకూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి పద్నాలుగు మంది సభ్యులు వచ్చినా పవర్ అస్త్రాలను గెలిచిన వాళ్లనే అసలైన కంటెస్టెంట్లుగా గుర్తిస్తున్నారు. ఇలా మొదటి వారం సందీప్, రెండో వారం శివాజి ఈ అస్త్రాలను గెలిచారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మూడో పవర్ అస్త్ర కోసం పోటీని ప్రారంభించారు. ఇందుకోసం బిగ్ బాస్ స్వయంగా పోటీదారులను ఎంపిక చేశాడు.

మూడో వారం పవర్ అస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. దీంతో ఈ ముగ్గురు కంటెస్టెంట్లు బాగా సంబరపడిపోయారు. అదే సమయంలో ప్రశాంత్, దామిని, ప్రియాంక జైన్ సహా కొందరు మాత్రం నిరాశ చెందారు. ఒక్కో కంటెస్టంట్‍ను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి ఆ ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు.
సందీప్, శివాజితో పాటు పోటీలు ఉన్న ముగ్గురు మినహా మిగిలిన వాళ్లంతా వెళ్లి అనర్హులు అయిన కంటెస్టెంట్ల పేర్లను చెప్పారు. అందులో శోభా శెట్టి పేరును పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు చెప్పగా.. ప్రిన్స్ యావర్ పేరును రతికా రోజ్, దామిని, తేజలు చెప్పారు. ప్రియాంక జైన్.. అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది. దీంతో ఎక్కువ ఓట్లు శోభాకే పడినట్లైంది.
కన్‌ఫెషన్ రూమ్‌లో కంటెస్టెంట్లు వేసిన ఓట్లు, వాళ్లు చెప్పిన కారణాలను బిగ్ బాస్ హౌస్‌లోని స్క్రీన్‌లో చూపించాడు. ముందుగా ప్రిన్స్ యావర్‌కు సంబంధించిన ఓటింగ్‌ను ప్లే చేశాడు. అది చూసిన తర్వాత అతడిలో కోపం పెరిగిపోయింది. దీంతో ఎప్పటిలాగానే తన నిరుత్సాహాన్ని ప్రదర్శించడంతో కోపంగా చూస్తూ గొడవలకు సిద్ధం అయ్యాడు. తేజపై సీరియస్ కూడా అయ్యాడు.
స్మోకింగ్ జోన్‌లో ఉన్న ప్రిన్స్ యావర్ కోపంగా ఉండడంతో అతడిని కంట్రోల్ చేయడానికి శోభా శెట్టి ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో అతడు ఎదురుగా ఉన్న టీపాయ్ గ్లాస్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించి, ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్ల బట్టి చెప్పాలంటే అతడు ఒకరకంగా సైకోలా ప్రవర్తించాడు.
ఇక, ప్రిన్స్ యావర్‌ను అలా చూసిన కంటెస్టెంట్లు అందరూ భయంతో పరుగులు తీశారు. ఒక్కరు కూడా అతడి దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. పైగా ఇంకా విమర్శలు చేశారు. దీంతో ఏమౌతుందా అని ప్రేక్షకుల్లో కూడా టెన్షన్ కనిపించింది. కాసేపటికి అతడు తేరుకోవడంతో ప్రియాంక జైన్ వెళ్లి కొన్ని మంచి మాటలు చెప్పింది. మొత్తానికి ప్రిన్స్ తీరు భయానకంగానే ఉంది.


Click it and Unblock the Notifications











