Bigg Boss Telugu 7: చరిత్ర సృష్టించిన యావర్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ కంటెస్టెంట్‌గా రికార్డు

ఎప్పుడూ చూడని కంటెంట్‌తో ప్రసారం అవుతున్నా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని.. దేశంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది తెలుగు బిగ్ బాస్. మధ్యలో కాస్త డౌన్ అయినా.. క్రమంగా పుంజుకున్న ఇది టాప్ రేటింగ్‌తో దుమ్ముదులుపుతోంది.

దీంతో నిర్వహకులు వరుస పెట్టి సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రిన్స్ యావర్ చరిత్ర సృష్టించాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

Prince Yawar Won Eviction Free Pass Task In Bigg Boss Telugu 7

ఏడో సీజన్‌లో యావర్ హైలైట్: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోంది. దీంతో ఆరంభం నుంచే ఇది అందరి మన్ననలు పొందుతూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ సీజన్‌లోకి 19 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ప్రిన్స్ యావర్ యమ హైలైట్ అయ్యాడు. బాడీ, డ్రెస్సింగ్, భాషతో బాగా ఫోకస్ అయ్యాడు. దీనికితోడు ఆట పరంగానూ మెప్పిస్తూ క్రేజ్ పెంచుకున్నాడు.

ఎవిక్షన్ గెలిచిన అర్జున్‌ షాక్: బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అంబటి అర్జున్ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్'ను గెలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 'అర్జున్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నందుకు అభినందనలు. కానీ, దీన్ని మీరు డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది' అని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లతో పోరాడి గెలిస్తేనే పాస్ అతడి దగ్గర ఉంటుందని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.

యావర్‌ను ఎంచుకున్నాడు: ఎవిక్షన్ ఫ్రీ పాస్ రెండో రౌండ్‌లో భాగంగా అంబటి అర్జున్‌కు బిగ్ బాస్ ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో తన పోటీదారుడిగా అతడు ప్రిన్స్ యావర్‌ను ఎంచుకున్నాడు. ఇందులో ఊగుతూ ఉండే ఓ ప్లాట్‌ఫాంపై ఐదు బాల్స్‌ను కింద పడకుండా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్‌పై యావర్ విజయం సాధించాడు. తద్వారా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను చేజిక్కించుకున్నాడు.

ప్రశాంత్‌తో ఆడిన యావర్: ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను అర్జున్ దగ్గర నుంచి గెలుచుకున్న యావర్‌కు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో తన పోటీదారుగా అతడు పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఈ టాస్కులో హౌస్‌లోని ఎల్‌ఈడీపై కనిపించిన నెంబర్‌ను బయట ఉన్న బైక్‌కు కరెక్టుగా అతికించాల్సి ఉంటుంది. ఇందులో కూడా ప్రిన్స్ యావరే విజయం సాధించి.. పాస్‌ను తన వద్దే ఉంచుకున్నాడు.

శోభాతో మరో టాస్కులోనూ: ఏకంగా రెండు టాస్కులు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తన వద్దే పెట్టుకున్న ప్రిన్స్ యావర్‌కు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో డైస్‌ను కరెక్టుగా వేసి ఆరు బర్గర్లను తినాల్సి ఉంటుంది. ఇందులో తన పోటీదారుగా శోభా శెట్టిని అతడు ఎంచుకున్నాడు. ఈ టాస్కులో సైతం ప్రిన్స్ యావర్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించాడు. తద్వారా ఇందులోనూ విజయం సాధించాడు.

చివరి రౌండ్‌లో ఇద్దరితో: అప్పటికే మూడు టాస్కులు గెలిచి ఉన్న యావర్‌కు బిగ్ బాస్ బ్యాలెన్సింగ్ టాస్కును ఇచ్చాడు. ఇందులో శివాజి, ప్రియాంకతో అతడు పోటీ పడాల్సి వచ్చింది. ఇది ఎన్నో హైడ్రామాల నడుమ సాగింది. మొత్తానికి ఈ టాస్కులో ప్రియాంక, శివాజి వరుసగా ఔట్ అయ్యారు. దీంతో ప్రిన్స్ యావర్ ఎక్కువ సేపు నిలిచి ఈ టాస్కులోనూ ఆధిపత్యాన్ని చూపించి సత్తా చాటుకున్నాడు.

చరిత్ర సృష్టించిన ప్రిన్స్: చివరి రౌండ్‌లో ఎవరు గెలిచారన్న దానిపై హైడ్రామా జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో కూడా ప్రిన్స్ యావరే గెలిచినట్లు సంచాలకులు ప్రకటించారని తెలిసింది. తద్వారా అతడే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలిచాడు. ఇదిలా ఉండగా.. వరుసగా నాలుగు టాస్కుల్లో గెలిచిన ఏకైక కంటెస్టెంట్‌గా ప్రిన్స్ చరిత్ర సృష్టించాడు. తద్వారా షో చరిత్రలో తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X