Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో నీచమైన ప్రవర్తన.. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ నొక్కుతూ!

ఎవరూ ఊహించని కాన్సెప్టుతో తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్‌ఫుల్‌గా మారిన షోనే బిగ్ బాస్. ఫలితంగా వరుస సంవత్సరాల్లో సీజన్లను నడుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ షో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది. ఈ ఊపులోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఊహకందని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌లో మేల్ కంటెస్టెంట్ ఏకంగా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వివరాలను మీరే చూసేయండి!

ఆ రికార్డులు చెరిపేయాలని
బిగ్ బాస్ ఇప్పటి వరకూ తెలుగులో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే 8వ సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేసేందుకు ఇందులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు చూపిస్తున్నారు.

Prithiviraj Shetty Misbehave with Prerana and Yashmi Gowda In Bigg Boss Telugu 8 Show

14మందిలో అతడు వైల్డ్‌గా

తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని స్పెషల్ ఫోకస్ అయ్యారు. వారిలో ప్రముఖ సీరియల్ నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఒకడు. మంచి ఇమేజ్‌తో షోలోకి కంటెస్టెంట్‌గా వచ్చిన అతడు ఆరంభం నుంచే తనదైన రీతిలో వైల్డుగా కనిపిస్తూ, ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

గొడవలతో పాటు బూతులు
తాజాగా జరుగుతున్న సీజన్‌లో పృథ్వీరాజ్ వ్యవహార శైలిపై అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలతో అతడి ప్రవర్తన ఏమాత్రం బాలేదని కొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ నాగార్జున కూడా అతడి ముఖం మీదనే విమర్శించారు. ఇదే కారణం చెప్పి చాలా మంది ఈ వారం నామినేట్ కూడా చేసిన విషయం తెలిసిందే.

ప్రభావతి టాస్కులో ఫైట్స్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మూడో వారంలో 'ప్రభావతి 2.O' టాస్కును ఇచ్చారు. ఇందులో నిఖిల్ క్లాన్, అభయ్ క్లాన్‌లలో ఎవరి దగ్గర ఎక్కువగా గుడ్లు ఉంటే వాళ్లు గెలుస్తారు. దీంతో ఇరు జట్ల సభ్యులు ఎక్కువ గుడ్లను సాధించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పృథ్వీ మరింత వైల్డుగా మారిపోయాడు. తరచూ ఎదిటి వాళ్లతో ఫైటింగ్స్‌కు దిగి విమర్శలపాలయ్యాడు.

అమ్మాయిలతో నీచంగానే
'ప్రభావతి 2.O' టాస్కులో భాగంగా గుడ్లను తీసుకునే క్రమంలో పృథ్వీరాజ్.. ప్రేరణ, యష్మీ గౌడతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్లిద్దరిని ప్రైవేట్ భాగాలను పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. అది గమనించిన సంచాలకుడు నబీల్ వదలమని మొత్తుకున్నా పృథ్వీ వినలేదు. పైగా వాళ్లను అలాగే చాలా సేపు పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

గూబ పగలగొట్టేసిన ప్రేరణ

పృథ్వీరాజ్ శెట్టి అసభ్యంగా ప్రవర్తించడాన్ని యష్మీ గౌడ లైట్ తీసుకున్నప్పటికీ ప్రేరణ మాత్రం అస్సలు తట్టుకోలేకపోయింది. అతడిపై అరుస్తూ సంచాలకుడికి పలుమార్లు కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా వినకపోవడంతో ఎలాగోలా విడిపించుకుని పృథ్వీరాజ్ గూబ పగలగొట్టేసింది. ఈ వ్యవహారంతో బిగ్ బాస్ షోపైన కూడా మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X