Bigg Boss Voting : గంగవ్వకి గుద్దిపారేస్తోన్న ఆడియన్స్ .. యష్మి- విష్ణుల హోరాహోరీ, ఆ ఇద్దరి ఫేట్ మారదా?
బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా ఆరో వారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో ఆరుగురు ఎలిమినేట్ కాగా.. పాత వారు 8 మంది మంది, కొత్తగా హౌస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన 8 మంది కలిపి 16 మంది ఉన్నారు. పాత కంటెస్టెంట్స్‌ని ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అని, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని రాయల్ క్లాన్ అని పిలుస్తున్నారు. కొత్త వారి రాకతో బిగ్‌బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు మాత్రమే నామినేషన్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. నామినేషన్‌లో ఉన్న వారి ఓటింగ్ ఎలా ఉందో పరిశీలిస్తే :
మంగళవారంతో నామినేషన్స్‌ని పూర్తి చేసిన బిగ్‌బాస్. బుధవారం గేమ్స్‌కి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించు అంటూ ఓ టాస్క్‌ని ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యుల్లో అమ్మాయిలని ఒక గ్రూప్‌గా, అబ్బాయిలను మరో గ్రూప్‌గా విభజించాడు. అమ్మాయిల టీమ్‌కి అవినాష్, అబ్బాయిల టీమ్‌కి రోహిణిలను లీడర్స్‌గా నియమించారు. ఇందులో అవినాష్ జట్టు గెలిచింది. ముందు రోజు నిఖిల్, నబీల్‌లు రేషన్ కోసం లోపలికి వెళ్లి సాల్ట్ ప్యాకేట్ మరిచిపోయారు. దీంతో ఉప్పు కోసం ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ని వేడుకోవడంతో సాల్ట్ ప్యాకెట్ ఇవ్వాలంటే ప్రైజ్ మనీలో రూ.50 వేలు కట్ అవుతాయని చెబుతాడు. తలపట్టుకున్న కంటెస్టెంట్స్‌కు ఈరోజు బిగ్‌బాస్ కాస్త రిలీఫ్ ఇచ్చాడు.

అవినాష్- రోహిణిలను పిలిచిన బిగ్‌బాస్ మీ ఇద్దరూ నన్ను నవ్వించాలని టాస్క్ ఇచ్చారు. కిందా మీదా పడి బిగ్‌బాస్‌ను నవ్వించారు వీరిద్దరూ. దీనికి కాంప్లిమెంట్‌గా సాల్ట్ ప్యాకెట్‌ను పంపించాడు బిగ్‌బాస్. గిన్నెలు తోముతుండగా విష్ణుప్రియ వేలు కట్ చేసుకుంటుంది. పృథ్వీ ఫస్ట్ ఎయిడ్ చేస్తానంటూ ప్రేమ కురిపించడంతో అతనికి విష్ణు ఓ హగ్ ఇచ్చింది. హౌస్‌లో ఉన్న డాక్టర్ గౌతమ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. నీకు మందు అవసరం లేదు.. పృథ్వీ హగ్ ఇస్తే చాలునని విష్ణుపై అవినాష్ సెటైర్లు వేస్తాడు.
తర్వాత విలాసవంతమైన హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఓజీ గ్యాంగ్‌ని హోటల్ స్టాఫ్‌గా.. రాయల్ క్లాన్‌ని హోటల్‌కి వచ్చే కస్టమర్లుగా విభజించాడు. అతిథులను మెప్పించి ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వాళ్లు ఈ వారం చీఫ్ కంటెండర్ అవుతారని, అలాగే స్టార్స్‌ను సంపాదించిన వారికి స్పెషల్ పవర్ కూడా దొరుకుతుందని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఆ వెంటనే ఇంటి సభ్యులంతా తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు.

ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు యష్మిగౌడ, విష్ణుప్రియ, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, గంగవ్వ, మెహబూబ్. అంతా టాప్ కంటెస్టెంట్స్ కావడంతో ఓటింగ్ రోజు రోజుకు మారిపోతోంది. కానీ గంగవ్వ మాత్రం లేటు వయసులో దుమ్మురేపుతున్నారు. ఈ వారం ఓటింగ్‌లో ఈ పెద్దావిడ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆమెకు 22.24 శాతం ఓట్లు పడగా. . మరో రాయల్ క్లాన్ సభ్యుడు మెహబూబ్‌కు 17.70 శాతం ఓట్లు పోలయ్యాయి.
మూడో స్థానం మాత్రం విష్ణు, యష్మిల మధ్య ప్రతిరోజూ దోబూచులాడుతోంది. విష్ణుకి 15.03 శాతం ఓట్లు పడగా.. యష్మికి 15.28 శాతం ఓటింగ్ నమోదైంది. పృథ్వీరాజ్ 14 శాతం ఓటింగ్‌తో ఐదో స్థానంలో, కిర్రాక్ సీత 9 శాతం ఓటింగ్‌తో లీస్ట్‌లో నిలిచారు. ప్రస్తుతానికి వీరిద్దరూ డేంజర్ జోన్‌లో నిలిచారు. పృథ్వీ ఓటింగ్ కాస్త మెరుగవుతుండగా.. సీతకు ఓట్లు పడటం లేదు. ఓటింగ్ లైన్స్ కొన్నిరోజులు ఓపెన్‌లో ఉండటంతో పరిస్ధితులు మారే అవకాశం ఉందని బిగ్‌బాస్ లవర్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











