Bigg Boss Voting : ఓటింగ్‌లో గంగవ్వ హవా..యష్మి లెక్కలు తారుమారు, డేంజర్ జోన్‌లోకి కండల వీరుడు
బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్ సభ్యులు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నారు. టేస్టీ తేజా, ముక్కు అవినాష్, రోహిణి, గంగవ్వలు తమ మార్క్ పంచ్‌లతో అలరిస్తున్నారు. ఇక టాస్క్‌లు, డిస్కషన్స్‌లో హరితేజ, మెహబూబ్, గౌతమ్ కృష్ణలు రెచ్చిపోతున్నారు. వీరి దూకుడు ముందు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ (పాత కంటెస్టెంట్స్) తేలిపోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకే నామినేషన్ వేసే ఛాన్స్ ఇవ్వడంతో ఓజీ టీమ్ షాకైంది. మరి ఈ వారం ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే :
ప్రతిరోజూ మార్నింగ్ బిగ్‌బాస్ వేసే సాంగ్‌కి పాత బ్యాచ్ డ్యాన్స్‌లు వేసేవాళ్లు కాదు.. విష్ణుప్రియో లేక మరో ఇద్దరు స్టెప్స్ వేసేవాళ్లు. అయితే నయని పావని మాత్రం ఉదయాన్నే రెడీ అయి కుర్చీ మడతపెట్టి అంటూ డ్యాన్స్ చేసింది. దీంతో నయని ఫేస్ గురించి పృథ్వీ దగ్గర డిస్కషన్ పెట్టింది యష్మి. ఆమెను మేకప్ లేకపోతే చూడలేమంటూ కామెంట్ చేసింది. నామినేషన్ సమయంలో యష్మీపై బయట జరుగుతున్న నెగెటివిటీ గురించి తెలియజేశారు రోహిణి, అవినాష్. అలాగే పృథ్వీ వెనుక తిరగొద్దని విష్ణుప్రియకు సలహా ఇచ్చి చూశారు. కానీ ఆమె పరిస్ధితి వినేలా లేదు.

ఇంతలో పెళ్లి టాపిక్ రావడంతో తేజాని చేసుకోమని విష్ణుకి గంగవ్వ సలహా ఇస్తుంది. వాడు నాలాగా డ్యాన్స్ చేయలేడని, కనీసం హగ్ చేసుకుందామన్నా సరిపోడని తేజని హర్ట్ చేసింది. అక్కడితో ఆగకుండా ఈ వంకతో పృథ్వీని పిలిచి అతనికి హగ్ చేసి ఇలా ఉండాలని చెబుతుంది. ఇక ప్రతి పనిలో వేలు పెడుతున్న గౌతమ్‌ని చూసి మెగా చీఫ్ నబీల్ బాగా హర్ట్ అవుతున్నాడు. మరోవైపు.. ఇంట్లో రేషన్ కోసం నబీల్, నిఖిల్ లోపలికి వెళ్లి ఇచ్చిన టైమ్‌లోగా కొన్ని సరుకులు తీసుకుని వచ్చేస్తారు.
కానీ వంటకు అత్యంత ముఖ్యమైన సాల్ట్ ప్యాకెట్ మరిచిపోతారు. దీంతో బిగ్‌బాస్‌ను కంటెస్టెంట్స్ అంతా అడుక్కోవడంతో.. సాల్ట్ ప్యాకెట్ కావాలంటే ప్రైజ్ మనీలో నుంచి రూ.50 వేలు కట్ అవుతాయని షాకింగ్ న్యూస్ చెబుతాడు బిగ్‌బాస్. దీంతో యాభై వేలు ఖర్చుపెట్టి సాల్ట్ ప్యాకేట్ తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఇంటి సభ్యులు డిస్కషన్ మొదలుపెట్టారు. అలా బిగ్‌బాస్ హౌస్‌లో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ , రాయల్ క్లాన్ సభ్యుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండ్రోజుల్లోనే పరిస్ధితి ఉంటే మున్ముందు ఓజీ గ్యాంగ్ పరిస్ధితి ఏంటోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
నామినేషన్స్ ప్రక్రియ సోమవారం పూర్తికాపోవడంతో మంగళవారంతో ఆరో వారం నామినేషన్స్‌ను కంప్లీట్ చేశారు బిగ్‌బాస్. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీగౌడ , గంగవ్వ, మెహబూబ్‌లు నామినేషన్స్‌లోకి వచ్చారు. ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌లో రిజల్ట్స్ రోజు రోజుకు మారుతున్నాయి. బిగ్‌బాస్‌లో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఓటింగ్‌లో దూసుకెళ్తున్నారు. ఆమెకు 29 శాతం ఓట్లు రాగా.. సెకండ్ ప్లేస్‌లో మెహబూబ్ (17.10 శాతం) ఉన్నాడు.
విష్ణుప్రియ 16.97 శాతం ఓట్లతో మూడో స్థానంలో, యష్మి గౌడ 16.61 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. సీత (11.12 శాతం ) యథావిధిగా లీస్ట్‌లో ఉండగా.. అనూహ్యంగా పృథ్వీ (15.02 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లోకి వచ్చాడు. నిన్నటి వరకు యష్మి ఐదో స్థానంలో నిలవగా.. ఇప్పుడు ఆమె తన ఓటింగ్‌ను మెరుగు పరచుకుంది. తాజా ఓటింగ్ ప్రకారం సీత, పృథ్వీరాజ్‌లు డేంజర్ జోన్‌లో నిలిచారు.


Click it and Unblock the Notifications











