Bigg Boss Telugu 8: షోలో లేడీస్‌ను అనకూడని మాటలు.. ఆమె కాళ్లు పట్టుకున్న సీరియల్ హీరో

ఊహకే అందని విధంగా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు దీన్ని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకే విజయవంతంగా చాలా సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదోది కూడా ప్రసారం అవుతోంది. ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వీరాజ్ ఊహించని పని చేశాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

వాటిని బీట్ చేయాలని
తెలుగులో ఇప్పటి వరకూ బిగ్ బాస్ ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే 8వ సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేసేందుకు ఇందులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు.

Prithviraj Shetty Touches Bezawada Bebakka Foot In Bigg Boss Telugu 8 Show

14 మందిలో ప్రత్యేకంగా

తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని స్పెషల్ ఫోకస్ అయ్యారు. వారిలో జబర్ధస్త్ బుల్లితెర ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఒకడు. మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న అతడు.. షోలోకి వచ్చి ప్రత్యేకంగా నిలిచాడు. దీంతో ఆరంభంలోనే అతడు హైలైట్ అయ్యాడు.

మంచి ఫిజిక్‌తో పోటీగా
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే పృథ్వీరాజ్ తనదైన రీతిలో మార్కును చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేస్తూ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా మంచి ఫిజిక్‌తో గేమ్స్ ఆడేలా ఉన్నాడు. అదే సమయంలో చాలా పోటీని ఇచ్చి చాలా వారాలు హౌస్‌లో కొనసాగేలా ముందుకు సాగుతున్నాడు.

నామినేషన్స్‌ గొడవలు

తాజాగా జరుగుతున్న సీజన్‌లో పృథ్వీరాజ్ వ్యవహార శైలి ఎలా ఉన్నా... కచ్చితంగా మాట్లాడుతూ, పాయింట్‌ను ఎదుటి వాళ్లకు అర్థం అయ్యేలా చెబుతున్నాడు. ముఖ్యంగా తాజాగా జరిగిన నామినేషన్స్‌లో పృథ్వీరాజ్ పలువురితో గొడవలు కూడా పెట్టుకున్నాడు. కానీ, ఆయా సందర్భాల్లో అతడు చెప్పిన కారణాలు, ఇచ్చిన వివరణలు ప్రేక్షకులను మెప్పించేలానే ఉన్నాయి.

ఆమెను అలా అనేస్తూ
పృథ్వీరాజ్ మగవాళ్లతో పాటు ఆడవారితోనూ గౌరవంగా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకునేలా ముందుకు వెళ్తున్నాడు. కానీ, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడు బెజవాడ బేబక్కను ఓ అనకూడని మాట అనేశాడు. అయితే, దీన్ని డైలీ ఎపిసోడ్‌లో ప్రసారం చేయలేదు. కానీ, దీని గురించి మాత్రం పలుమార్లు టాపిక్ వచ్చింది. ఇదే నామినేషన్స్‌లోనూ వినిపించింది.

కాళ్లు పట్టుకున్నాడు

పృథ్వీరాజ్ తనను అనకూడని మాట అన్నాడని చెబుతూ బెజవాడ బేబక్క అతడిని నామినేట్ చేసింది. దీనికి అతడు కూడా ఒప్పుకున్నాడు. తర్వాత నిఖిల్ అతడితో 'నువ్వు బేబక్కకు సారీ చెప్పు' అని చెప్పాడు. అప్పుడు పృథ్వీరాజ్ ఆమె దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. అంతేకాదు, ఆమె కాళ్లు కూడా పట్టుకున్నాడు. దీంతో అసలు అతడు ఏమన్నాడు అన్నది మిస్టరీగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X