అర్ధరాత్రి బాత్రూంలో లహరితో యాంకర్ రవి అలా.. ప్రియ నోట అతిదారుణంగా... వాష్ రూమ్ ఘటనపై బిగ్‌బాస్‌లో రచ్చ

బిగ్‌బాస్ ఇంటిలో మూడో వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రియ, లహరి షారి, యాంకర్ రవి, విజే సన్నీకి మధ్య భారీ గొడవకు దారి తీసింది. లహరి షారిని ప్రియ నామినేట్ చేస్తూ కిచెన్‌లో జరిగిన సంఘటన చెబుతూ చేసిన కామెంట్ ఇంటి సభ్యుల్లో అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ నలుగురి మధ్య జరిగిన భారీ గొడవకు ప్రియ చేసిన కామెంట్లు ఏమిటంటే..

కిచెన్‌లో జరిగిన ఓ సంఘటనను

కిచెన్‌లో జరిగిన ఓ సంఘటనను

కిచెన్‌లో జరిగిన ఓ సంఘటనను చెబుతూ. పాలలో కాఫీ పౌడర్ వేస్తే పాలు విరిగిపోతాయి. కాబట్టి కాఫీ పౌడర్ వేయవదని ఓ అక్కగా ఆమెకు చెప్పాను. కానీ ఆమె వినకుండా అందరితో బిజీగా మాట్లాడుతూ కనిపించింది. ముఖ్యంగా ఆమె ఎప్పుడూ మగవాళ్లతో బిజీగా ఉంటూ కనిపిస్తుంది అని ప్రియ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే నేను మగాళ్లతో బిజీగా ఉంటున్నానా? నేను అమ్మాయిలతో మాట్లాడటం లేదా అంటూ లహరి ప్రశ్నించింది. నేను ఏ మగాళ్లతో బిజీగా ఉంటున్నానో మీరే చెప్పండి అంటూ ప్రియను లహరి షారి ప్రశ్నించింది.

మగాళ్లతో బిజీగా అంటూ ప్రియ

మగాళ్లతో బిజీగా అంటూ ప్రియ

జాతీయ ఛానెల్‌లో ప్రతీ సారి మగాళ్లతో బిజీగా ఉంటున్నారు అంటూ పదే పదే కామెంట్ చేయడం సరికాదు. నేను ఎవరితో అలా ఉన్నానో పాయింట్‌గా చెప్పు అని లహరి షారి నిలదీసింది. అయితే నేను కొన్ని సంఘటనలు చూశాను. కాబట్టే ఈ మాట అన్నాను. అర్ధరాత్రి రవితో బాత్రూంలో ఉండటం చూశాను. మీరిద్దరు కౌగిలించుకోవడం చూశాను. అది ఫ్రెండ్లీగా కౌగలించుకొన్నారా? లేదా మరో విధంగా కౌగిలించుకొన్నారా తెలియదు అంటూ ప్రియ చెప్పింది. దాంతో లహరి షారి సూపర్.. ఎక్ట్రార్డనరీ అంటూ చప్పట్లు కొట్టింది.

ప్రియ మాటలకు దిగ్బ్రాతికి గురైన రవి

ప్రియ మాటలకు దిగ్బ్రాతికి గురైన రవి

ప్రియ మాటలకు దిగ్బ్రాతికి గురైన రవి ఏదో చెప్పబోతుండగా లహరి అడ్డుకొని ఆ రోజు బాత్రూంలో ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నించింది. రవి బర్త్ డే ఉందని.. కెమెరా వద్దకు వెళ్లి రవి బ్రో బర్త్ డే ఉంది. ఒక షర్ట్ పంపించమని నా బ్రదర్‌కు చెప్పాను. అలాగే మానస్ కూడా వైట్ షర్ట్ తీసుకురమ్మని కూడా చెప్పాను అని లహరి అంటే.. నీ వాయిస్ పెంచకు అని ప్రియ అడ్డు చెప్పింది.

నా వాయిస్ పెంచకుండా ఉండలేను

నా వాయిస్ పెంచకుండా ఉండలేను

అయితే నేను ఈ విషయంలో నా వాయిస్ పెంచకుండా ఉండలేను అంటూ లహరి షారి ఘాటుగా స్పందించింది. అయితే గొంతు చించుకొని అరిస్తే తప్పు ఒప్పు కాదు అంటూ ప్రియ సమాధానం చెప్పింది.

బాత్రూంలో మీరిద్దరు కౌగిలించుకోవడం

బాత్రూంలో మీరిద్దరు కౌగిలించుకోవడం

హగ్ అనేది ఇంటిలో తప్పు కాదు. కానీ మీరు సందర్భాన్ని నొక్కి చెప్పడం కరెక్టా అని యాంకర్ రవి నిలదీశాడు. అవును నేను చూసింది లేట్ నైట్. బాత్రూంలో మీరిద్దరు కౌగిలించుకోవడం చూశాను. అదే చెప్పాను. అదేమన్నా లివింగ్ రూమ్ కాదుగా, అదేమన్నా బెడ్ రూమ్ కాదుగా.. అని ప్రియ తన మాటలను సమర్ధించుకొన్నది. అయితే మీరు మెన్ అంటూ పదం ఉపయోగించారు. లహరి కంటే సిరితో ఎక్కువ క్లోజ్‌గా ఉన్నాను. కానీ సిరి అని చెప్పకుండా.. నీకు లహరితో సరిగా రిలేషన్ లేదు కాబట్టి ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని రవి తప్పుపట్టారు.

ప్రియ నేను చూసిందని చెప్పాను

ప్రియ నేను చూసిందని చెప్పాను

అయితే ప్రియ నేను చూసిందని చెప్పాను అంటే.. నీకు అలా మాట్లాడే హక్కు లేదు. అలాంటి మాటలు వాడటానికి హక్కు లేదు అంటూ యాంకర్ రవి ఆగ్రహం వ్యక్తం చేసింది. నీవు మాటలు నా బిడ్డకు అర్ధమైతే ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఉన్నారు పిల్లలు.. నీవు ఆడదానివే కదా అంటూ యాంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X