వెబ్ సిరీస్ కోసం విలన్ గా మారిన భామ
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు టైం చాలా స్లోగా నడుస్తుంది.టాలీవుడ్ లో తమన్నాకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా ఫీమేల్ టీమ్ కోచ్ గా కనిపించనుంది.
ఇదిలా ఉంటే త్వరలో తమన్నా వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టనుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులను నటించనున్నారు . ఈ సిరీస్ కు 8 అవర్స్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారు . డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రియా బెనర్జీ కూడా నటిస్తుంది. ప్రియా బెనర్జీ అడవి శేష్ నటించిన కిస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆతర్వాత ఆ సినిమా తర్వాత అసురలో నారా రోహిత్‌తో నటించింది.నారా రోహిత్, సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోలతో నటించినా కూడా ఈమెకు తెలుగులో అనుకున్న క్రేజ్ రాలేదు. జోరు, అసుర లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మడు జాడ మిస్ అయింది..
తాజాగా ఈ బ్యూటీ తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఆ వెబ్ సిరీస్ లో ప్రియా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. తాజాగా ప్రియా మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నానని , తన క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది .


Click it and Unblock the Notifications











