యాంకర్ రవితో కలిసి గేమ్ ఆడితే ఎలిమినేషనే.. కన్నింగ్, అతడి గేమ్ ప్లాన్ అదే.. ప్రియ ఘాటైన కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన నటి ప్రియ తన ఇంటి అనుభవాలను పంచుకొంటున్నారు. ఇంటి నుంచి బయటు వచ్చిన తర్వాత స్టార్ మా మ్యూజిక్ నిర్వహించే టాక్‌ షోలో పాల్గొన్నారు. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరి హోస్ట్‌గా నిర్వహించే ఈ టాక్ షోలో ఇంటి సభ్యుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ఫోటోలు చూపిస్తూ ప్రియను అరియానా ప్రశ్నలకు ఇలా సమధానాలు చెబుతూ..

వీజే సన్నీకి ఫ్లయింగ్ కిసెస్

వీజే సన్నీకి ఫ్లయింగ్ కిసెస్

ఇక వీజే సన్నీ ఫన్నీ వ్యక్తి. మీరు ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నారు అని అరియానా అంటే అంటే.. నవ్వుల్లో మునిగిపోయింది. ఇక కాజల్ టాప్ 5లో ఉంటుందా అంటే.. ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోను ఆమె టాప్ 5లోకి రాకూడదు అంటూ చాలా కోపంగా ప్రియ సమాధానం ఇచ్చారు.

కాజల్‌ను చూసి ముఖం చిట్లించి

కాజల్‌ను చూసి ముఖం చిట్లించి

కాజల్‌ను చూసి ఒక్కసారి ఒళ్లు జలదరించినట్టు ముఖం పెట్టింది. దాంతో కాజల్‌కు నీవు భయపడుతున్నావా? అంటే వామ్మో అంటూ ప్రియ కామెంట్ చేసింది. కాజల్ ఎత్తులు పైఎత్తులు చేస్తే షాక్ అవ్వాల్సిందే. మీరు ఏ కంటెస్టెంట్‌నైనా టార్గెట్ చేశానంటే ఆ కంటెస్టెంట్ అంతు చూసే వరకు వదిలే ప్రసక్తి లేనట్టు కనిపించింది అని అరియానా అంటే.. అది నా గేమ్ ప్లాన్ అంటూ ప్రియ కామెంట్ చేసింది.

ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్

ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్

ఇక ప్రియాంక, మానస్ లవ్ ట్రాక్‌పై ప్రియతో అరియానా ముచ్చటిస్తూ.. ప్రియాంకను పట్టించుకోకపోతే ప్రేక్షకులు ఏమంటారో అని మానస్ భయపడుతున్నారా? లేదా భరిస్తారా అంటే.. అలాంటి ఏమీ లేదు. అలాంటి ఆలోచన వద్దు.. ఇట్స్ ఆల్ బుల్‌షిట్ అంటూ ప్రియ స్పందించింది. వారి మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్ ఉందనే విధంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.

స్నేహం పేరుతో షణ్ముఖ్‌ను సిరి

స్నేహం పేరుతో షణ్ముఖ్‌ను సిరి

స్నేహం పేరుతో షణ్ముఖ్‌ను సిరి హన్మంతు వాడుకుంటుందా అని అరియానా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సిరి తన గేమ్‌ను జెన్యూన్‌గానే ఆడుతున్నది. నిజాయితీ ఆడుతున్నది, గేమ్‌ను విన్ కావడానికి వచ్చింది. ఆమె టాప్ 5లో ఉండటానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది. తన వ్యూహం తనకు ఉంది. దాని కోసం ఏదైనా చూస్తుంది అని సిరి గురించి ప్రియ చెప్పింది.

షణ్ముఖ్‌ను భరించలేం..

షణ్ముఖ్‌ను భరించలేం..

షణ్ముఖ్ జస్వంత్ గురించి అరియానా మాట్లాడుతూ.. మీకు ఆయన గేమ్ నచ్చుతుందా అని అడిగితే.. షణ్ముఖ్‌ను భరించలేం. అతడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అంటూ ప్రియ ముఖం చిట్లించింది. ఇక సిరి హన్మంతు గురించి మాట్లాడుతూ.. ఆమె వాయిస్, మాట తీరు, ప్రవర్తన అంతా ఫేక్. నాకు ఆమె తీరు ఏ మాత్రం నచ్చదు అంటూ ప్రియ కామెంట్ చేసింది.

యాంకర్ రవి ఎత్తుకు పైఎత్తు

యాంకర్ రవి ఎత్తుకు పైఎత్తు

యాంకర్ రవి గేమ్ గురించి అరియానా గ్లోరి మాట్లాడుతూ.. ఆయన గేమ్ ఆడటానికి వచ్చాడా? బయట ఏం అనుకొంటున్నారని చెప్పడానికి వచ్చాడా అంటే.. ఎత్తుకు పై ఎత్తు వేయగలడు. అందర్ని తన గేమ్‌తో ప్రభావితం చేసే ప్లాన్ అతడి వద్ద ఉంది అంటూ ప్రియ ఘాటుగా స్పందించింది.

రవి కన్నింగ్.. స్మార్ట్ అంటూ

రవి కన్నింగ్.. స్మార్ట్ అంటూ

యాంకర్ రవి ఇంటిలో ప్రభావితం చేస్తున్నారో లేదో. కానీ అతడితో ఎవరు గేమ్ ఆడితే వాళ్లు పక్కాగా ఎలిమినేట్ అవుతున్నారు అని అరియానా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రవి వెరీ కన్నింగ్, వెరీ స్మార్ట్. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరో గుర్తించి వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్లాన్‌లో రవి ఉన్నాడు అని ప్రియ అభిప్రాయపడింది.

Recommended Video

#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
రవితో గేమ్ ఆడి ఎలిమినేట్ అయిన వారు వీరే..

రవితో గేమ్ ఆడి ఎలిమినేట్ అయిన వారు వీరే..

ఇప్పటి వరకు యాంకర్ రవితో గేమ్ ఆడిన కంటెస్టెంట్లు అందరూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఆ జాబితాలో నటరాజ్ మాస్టర్, లహరి షారీ, శ్వేతా వర్మ ఉండటంతో అలాంటి వాదనకు బలం చేకూరింది. ముఖ్యంగా లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో ఇలాంటి చర్చ కూడా జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X