మాది దేవుడిచ్చిన బంధం.. కళ్యాణ్ పడాలతో నా రిలేషన్ ఇదే..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి (Priya Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్నిపరీక్ష దశలోనే తన క్యూట్ లుక్స్, కాన్ఫిడెన్స్‌తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించిన ప్రియా, షో ప్రారంభంలోనే హౌస్‌లో స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది తక్కువ సమయమే అయినా మంచి గుర్తింపు సంపాదించింది. తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా శెట్టి తన బిగ్ బాస్ జర్నీతో పాటు విన్నర్ కళ్యాణ్ పడాలతో ఉన్న బాండింగ్ గురించి వెల్లడించింది.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియా శెట్టి ఇటీవల కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో మొదట తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, మొదట అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలని అనుకున్నానని ప్రియా వెల్లడించింది. కానీ అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలిపింది. అనంతరం ఇండియాలోనే ఉండి తల్లిదండ్రులతో కలిసి చదువుకోవాలని భావించి ఎంబీఏ ఎంట్రన్స్ కూడా రాసిందని చెప్పింది. అయితే అడ్మిషన్ తీసుకునేలోపే బిగ్ బాస్ నుండి కాల్ రావడం తన జీవితాన్ని కొత్త దిశగా మలిచిందని వెల్లడించింది.

చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి ఉండేదని, నటనపై ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో ఆడిషన్లకు వెళ్లేదాన్నని చెప్పింది. అయితే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం, కుటుంబ సభ్యుల భయం కారణంగా వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని భావోద్వేగంగా వివరించింది. కానీ బిగ్ బాస్ షోలో తనను చూసిన తర్వాత తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందని, ఇప్పుడు తాను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలనని వారు నమ్ముతున్నారని తెలిపింది.
హౌస్‌లో తన అగ్రెసివ్ ప్రవర్తనపై వచ్చిన విమర్శల గురించి స్పందిస్తూ, తాను అసలు చాలా క్యూట్ అని, కానీ షోలో తన గట్టిగా మాట్లాడే వైఖరిని మాత్రమే హైలైట్ చేశారని చెప్పింది. తాను ఎప్పుడూ స్ట్రెయిట్‌గా మాట్లాడే వ్యక్తినని, ఇండైరెక్ట్‌గా మాట్లాడటం తనకు రాదని స్పష్టం చేసింది. హౌస్‌లో ప్రతి ఒక్కరి వాయిస్ ఒక్కోలా ఉంటుందని, తన వాయిస్ మాత్రం సహజంగానే గట్టిగా ఉంటుందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తన వాయిస్ అలానే ఉందని, అదే కొన్నిసార్లు తనకు మైనస్‌గా మారిందని అంగీకరించింది.
బిగ్ బాస్ తర్వాత ఎవరికైనా సారీ చెప్పాలనిపించిందా అన్న ప్రశ్నకు, నటుడు భరణి గారికి క్షమాపణ చెప్పాలని అనిపించిందని వెల్లడించింది. హౌస్‌లో జరిగిన ఒక నామినేషన్ సందర్భంగా తన ప్రొఫెషన్ గురించి మాట్లాడటంతో తనకు కోపం వచ్చిందని, ఆ సమయంలో భావోద్వేగానికి లోనై గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి సారీ చెప్పానని చెప్పింది. హౌస్‌లో జరిగే గొడవలు ఎక్కువగా సిచువేషన్ల వల్లనే వస్తాయని, వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు ఉండవని స్పష్టం చేసింది.
ఇక కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తే ఎవరికీ చెబుతారని అడగగా, బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలని ప్రియా పేర్కొంది. తనకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, అతడిని చిన్న తమ్ముడిలా భావిస్తానని చెప్పింది. అతని విషయంలో తాను చాలా పొసెసివ్‌గా ఉండేదాన్నని, అతడు ఎలా ఉంటున్నాడో, ఏమి చేస్తున్నాడో ఎక్కువగా ఆలోచించేదాన్నని వెల్లడించింది. హౌస్‌లో అతనితో తన బాండింగ్ ఎంతో ప్రత్యేకమని, సొంత తమ్ముడితో ఉండే అనుబంధంలా అనిపించేదని భావోద్వేగంగా చెప్పింది.
కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని, అతడు గెలిచినప్పుడు తానే గెలిచినట్టుగా భావించి స్టేజ్‌పై డాన్స్ చేసి సెలబ్రేట్ చేసినట్లు గుర్తుచేసుకుంది. అలాగే తనుజ గురించి మాట్లాడుతూ, ఆమె జర్నీ తనను ఎంతో ప్రేరేపించిందని తెలిపింది. హౌస్‌లో తనుజతో చాలా క్లోజ్‌గా ఉండేదాన్నని, బయటకు వచ్చిన తర్వాత కూడా తమ స్నేహం అలాగే కొనసాగుతోందని చెప్పింది. ప్రతి ఈవెంట్‌లో కలుస్తూ టచ్‌లోనే ఉన్నామని, ఆమె వ్యక్తిత్వం తనకు చాలా నచ్చిందని తెలిపింది.
తాను బిగ్ బాస్ హౌస్ నుండి త్వరగా బయటకు రావడానికి కారణం గురించి మాట్లాడుతూ, గేమ్ పూర్తిగా అర్థమయ్యేలోపు ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని ప్రియా ఎమోషనల్ అయింది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ, అదృష్టం కలిసిరాకపోవడంతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. అయినప్పటికీ, ఈ అనుభవం తన జీవితానికి మంచి మార్గదర్శకంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications