Bigg Boss Telugu 7 Winner: ఫినాలేకు ముందే ప్రియాంక షాకింగ్‌గా.. బయటకు వెళ్లిపోతానంటూ ఫైర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరి చేత ఆహా అనిపిస్తున్న ఈ షో ఎవరూ ఊహించని స్థాయిలో సందడి చేస్తుంది. అయితే రేపటితో విజయవంతంగా 15 వారాలు పూర్తి చేసుకోబోతుండగా... విన్నర్, రన్నరప్ లు ఎవరో తేలిపోనుంది. అయితే ఇంత కాలం పాటు హౌస్ లో ఎన్నో టాస్స్ లు ఆడి, గేమ్స్ గెలిచి ఇక్కడి వరకూ వచ్చారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా టాప్ 6 కంటెస్టెంట్లు ప్రస్తుతం హౌస్ లో ఉంటూ రచ్చ చేస్తున్నారు. అయితే ఎంతో ఫన్ చేస్తూ రేపటితో బయటకు రాబోయే వీళ్లు... ఈరోజు ఫఉల్ గొడవలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా ఈరోజు తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే.. ఆ విషయం అర్థం అయిపోతుంది. ముందు నుంచి ఎంతో చక్కగా ఉంటున్న ప్రియాంక జైన్ ఎవరూ ఊహించని స్థాయిలో రచ్చ చేసింది. ఎప్పుడు కూడా ఏడవని ఈమె.. ఇంట్లోంచి వెళ్లిపోతానంటూ కామెంట్లు చేసింది. ఇల్లంతా ఆగ్రహంగా తిరుగుతూ ఆగమాగం చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది, ఇంట్లోంచి వెళ్లిపోతానని అనాల్సిన అవసరం ఏం వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Priyanka Fires on Bigg Boss And Says Open The Gates in Bigg Boss Telugu 7

ఆదివారంతో షో ముగిసిపోనుండగా... కంటెస్టెంట్లకు పన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే 104వ రోజులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్క్ లో ప్రియాంక ఇలా బిహేవ్ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో జరిగిన, చోటు చేసుకున్న అద్భుతమైన కొన్ని ఐకానిక్ సన్నివేషాలను ఇంట్లో వాళ్లు మరోసారి రీక్రియేట్ చేయాలని చెప్పారు. అయితే ఎవరి పాత్రలను వారు కాకుండా ఇంట్లోని వాళ్లు అలా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ఒక్కొక్కరూ ఒక్కోలా రెచ్చిపోయి మరీ నటించి మెప్పించారు. ముందుగా అమర్ దీప్ పాత్రను అంబటి అర్జున్, గౌతమ్ పాత్రలో అమర్, రతికా పాత్రలో ప్రియాంక కనిపించారు.

Priyanka Fires on Bigg Boss And Says Open The Gates in Bigg Boss Telugu 7

ఒక్కొక్కరూ వీర లెవెల్ లో యాక్టింగ్ ఇరగదీస్తూ టాస్క్ కు న్యాయం చేశారు. కెప్టెన్సీ బాల్ టాస్క్ లో చాలా గొడవ చేశారు. అంబటి అర్జున్ అయితే ఫుల్ అగ్రెషన్ చూపించారు. ఇక ఆ తర్వాత ప్రియాంక పెన్ తో తన మూతికి గీతలు గీసుకొని గడ్డం పెట్టుకుంది. అయితే ఆమెను అలా చూడగానే ఎవరో మనం గుర్తించకపోయినప్పటికీ.. కప్పు చేతిలో పట్టుకొని కాఫీ అయిపోయిందని అని తెలిపిన విధానం చూస్తుంటే ఆమె శివాజిని ఇమిటేట్ చేస్తుందని అర్థం అయిపోతుంది. ముఖ్యంగా కాఫీ కూడా పంపించరా అంటూ బిగ్ బాస్ పై ఫుల్ ఫైర్ అయింది.

Priyanka Fires on Bigg Boss And Says Open The Gates in Bigg Boss Telugu 7

ఆ తర్వాత ఇల్లంతా కలియతిరుగుతూ... తలుపులు తీయబిగ్ బాస్... నేనెళ్లిపోతాను బిగ్ బాస్ అంటూ రచ్చ చేసింది. అది విన్న బిగ్ బాస్ తలుపులు తీయడానికి బదులుగా.. శివాజి మీరు మైక్ ను సరిగ్గా ధరించండి అని చెప్పారు. దానికి శివాజి తడబడి తన దగ్గర ఉన్న మైక్ ను చూసుకున్నాడు. కానీ బిగ్ బాస్ చెప్పింది శివాజిని ఇమిటేట్ చేస్తున్న ప్రియాంకకు. ఇంత చక్కటి వినోదాన్ని అందిస్తూ ఫుల్ ఎంటర్ టైన్ చేసిన వీరిలో ఎవరో ఒకరు విన్నర్ గా తేలబోతున్నారు. పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప ఇంత మంచి ఫన్ ను ఎంజాయ్ చేయలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X