షాపింగ్ మాల్‌లోనే ప్రియుడిని కొట్టిన ప్రియాంక జైన్.. వారిద్దరి మధ్య చిచ్చుకు కారణం ఏంటంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బ్యూటీ ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాధించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోంది. అయితే తాజాగా షాపింగ్ మాల్ కు వెళ్లిన ఈ జంట అక్కడే గొడవ పడ్డారు. అందరి ఉన్నారని కూడా చూడకుండా కొట్టుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య చిచ్చుకు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియాంక్ జైన్ తెలిసిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రియుడు శివ్ కుమార్ కూడా తెలిసే ఉంటాడు. బిగ్ బాస్ షో ముందు వరకు ఈ విషయం బయట పడకపోయినా.. ఈ షో ద్వారానే వీరిద్దరి మధ్య బంధాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఎప్పటి నుంచో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట... బిగ్ బాస్ షోలో చేసిన రొమాన్స్ చూసి అంతా షాకయ్యారు. ముఖ్యంగా వీరి ముద్దులు, హగ్గులు చూసి చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇప్పడిప్పుడే వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అనుకుంటూ కాస్త శాంతిస్తున్నారు.

ముఖ్యంగా వీరిద్దరి మధ్య బాండింగ్ ను ప్రియాంక జైన్ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెబుతూనే ఉంటుంది. అయితే తొలిసారి వీరిద్దరి మధ్య రేగిన చిచ్చు గురించి నెవర్ ఎండింగ్ టేల్స్ ఛానెల్ ద్వారా చూపించారు. అయితే వీరిద్దరూ కలిసి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లారు. అక్కడే అనేక రకాలు చీరలు చూస్తూ.. కొనే ప్రయత్నం చేశారు. అయితే చీరలు సెలెక్ట్ చేయమని చెబుతున్న శివ్.. వాటిని ఎవరికి ఇవ్వబోతున్నాడో మాత్రం చెప్పలేదు. అసలు ఎవరి కోసం అని ప్రియాంక అనగా.. ముందుగా తడబడ్డాడు.
ఆ చీరలను అమెరికాలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కోస తీసుకెళ్తానని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ హా.. నువ్వు అక్కేడ సెటిల్ అవుతానని అంటుంది అందుకోసమేనా, నువ్వు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ ప్రియాంక జైన్ గట్టిగా ఫైర్ అయింది. అలా కాదని ప్రియుడు చెబుతున్నా వినకుండా అతడిని కొట్టింది. నా చేయి వదులు నేను వెళ్లిపోతానంటూ రచ్చ చేసింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, నాటకాలు చేస్తున్నావా అంటూ అందరి ముందే రచ్చ చేసింది. అప్పటి వరకు శివ్ ఆమెకు నచ్చజెపుతూనే ఉన్నాడు.

చివరకు అమెరికాలో ఉన్న అమ్మాయి నా స్నేహితురాలు... ఆమె పెళ్లి చేసుకోబోతుంది, నేను అందు యూఎస్ వెళ్తున్నాను.. ఆమె గిఫ్టుగా ఇచ్చేందుకే చీరలు సెలెక్ట్ చేయమంటున్నానని అసలు విషయం చెప్పాడు. ఇదంతా విన్న ప్రియాంక జైన్ కూల్ అయింది. చివరకు షాపింగ్ మాల్ వాళ్లకు సారీ చెప్పి.. చీరలు సెలెక్ట్ చేసింది. అయితే కావాలనే శివ్ కుమార్ ప్రియాంక జైన్ పై ప్రాంక్ చేసినట్లు ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











