Priyanka Jain: ప్రియాంక జైన్, శివ్‌ల పెళ్లి వేడుకలు షురూ.. ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ పూర్తి.. పెళ్లెప్పుడంటే?
బిగ్ బాస్ తెలుగు 7 టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఓ షోలో తన ప్రియుడు శివ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఈవేడుకకు తన కుటుంబ సభ్యులు సైతం హాజరు అయ్యారు. అయితే తాజాగా మరోసారి అఫీషియల్ గా పెళ్లి చేసుకోబోతుందీ జంట. ముఖ్యంగా వీరి పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా పూర్తి చేసుకుంది. మరి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌన రాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7 షోకు కూడా వెళ్లింది. అక్కడే తన అద్భుతమైన ఆట తీరుతో.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ టాప్ 5లో నిలిచి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అక్కడే తన ప్రియుడితో ప్రేమ గురించి, లివింగ్ రిలేషన్ గురించి వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా తన ప్రియుడితోనే తిరుగుతూ సందడి చేస్తోంది. అనేక పుణ్యక్షేత్రాలు, వేరే ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ యూట్యూబ్ ఛానెల్ వేదికగా కూడా కలిసి వీడియోలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ వీడియోలు చూసే ప్రతీ ఒక్కరూ మీ పెళ్లి ఎప్పుడు అంటూ అడిగి రచ్చ చేశారు. వీళ్లు కూడా అంతా అవే ప్రశ్నలు అడగ్గా సమాధానం చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరించారు.
ముఖ్యంగా మొన్నీమధ్యే ఓ షోలో భాగంగా పెళ్లి చేసుకుందీ క్యూట్ జంట. అయితే ఈ వేడుకకు వీళ్లు కుటుంబ సభ్యులు కూడా హాజరు కాగా అంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా వీరి యూట్యూబ్ ఛానెల్ వేదికగా కూడా తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. అయితే సడెన్ గా జరిగిందని వివరించారు. అయితే షోకోసమే పెళ్లి చేసుకున్న ఈ జంట రియల్ గా కూడా పళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఈ జంట పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించేశారు.

ముఖ్యంగా ఈ జంట ఈరోజు తమ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ను చేయించుకున్నారు. అయితే ఇది ఉగాది పండుగ సందర్భంగా చేసుకున్న పెళ్లి కోసమే అని కూడా చివర్లో క్లారిటీ ఇచ్చారు. కానీ వీరు రెడీ అవ్వడం దగ్గర నుంచి ఫొటో షూట్ పూర్తి అయ్యే వరకూ మొత్తాన్ని వీడియోగా తీసి పెట్టారు. ఇందులో వారు చేసిన అల్లరి, ముస్తాబు అవడం అంతా తెగ అలరిస్తున్నాయి. మీరు కూడా ఈ క్యూట్ కపుల్ వీడియోను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











