సడెన్‌గా పెళ్లి.. వారం తిరక్కముందే గుడ్ న్యూస్.. శివ్, ప్రియాంక ప్లాన్ మామూలుగా లేదుగా!
మౌనగారం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా వారం రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. వారం తిరక్కముందే గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విశేషాలు అంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అద్భుతంగా గేమ్ అడి అందరినీ అలరించిన ప్రియాంక జైన్ టాప్ 5కి చేరింది. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలతో చాలా స్నేహంగా ఉంటూ చక్కగా గేమ్ ప్లే చేసింది. చూసేందుకు పొట్టిగా ఉన్నా సరే అందరు మెచ్చేలా గేమ్ ఆడుతూ అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా షోలో ఉండగానే తాను ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా అతడి ఫ్యామిలీ వీక్ లోభాగంగా హౌస్ లోకి రాగా ముద్దుల వర్షం కురింపించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుందామంటూ అడిగి రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి తిరుగుతూ రచ్చ చేస్తోంది. పూజలు పనస్కారాలు చేయడంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాలకు కూడా వెళ్తూ రచ్చ చేస్తోంది. అయితే సీరియల్స్ మానేసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన ప్రియుడు శివ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.

షోలో భాగంగానే ఈ క్యూట్ కపుల్ పెళ్లి చేసుకోగా.. నిజంగానే వాళ్ల పేరెంట్స్ ఈ షోకు వచ్చారు. స్టార్ మా టీవీ ఉగాది పండుగ సందర్భంగా "ఉగాదికి పండగొచ్చింది" అనే పేరుతో షో నిర్వహించారు. ఇక ఈ షోలో భాగంగానే ప్రియాంక జైన్, శివ్ కుమార్ లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి వారం రోజులు కూడా కాకముందే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తామిద్దరూ కలిసి తమ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
నెవెర్ ఎండింగ్ టేల్స్ లో భాగంగా ఈ జంట.. తాము కొత్త ఇంటిని కొనుగోలు చేసుకోబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వాళ్లు కొనే ఇళ్లు చూసేందుకు వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. వాటిన్నిటినీ ఒకే వీడియోగా మలిచి యూట్యూబ్ లో పెట్టారు. అందులో తమకు ఓ ఇళ్లు నచ్చిందని.. త్వరలోనే తాము దాన్ని కొనుగోలు చేసి షిఫ్టు అయిపోతున్నట్లు వివరించారు.


Click it and Unblock the Notifications











