Bigg Boss Telugu 7 నా చెప్పుతో నేనే కొట్టుకొంటా.. అమర్‌దీప్‌పై ప్రియాంక ఆగ్రహం.. SPA గ్రూప్‌లో లుకలుకలు
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో ముగింపుకు దశకు చేరుకొంటున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరిగింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రూప్‌గా ఆడుతున్నారంటూ, ఒకరికొకరు ఫేవరిజం చూపించుకొంటున్నారంటూ శోభ శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ (SPA)పై ఆరోపణలు వచ్చాయి. అయితే టైటిల్ రేస్ టైట్ అవ్వడంతో కావడంతో వారి మధ్యనే భారీ పోటీ కనిపిస్తున్నది. ఈ క్రమంలో ప్రియాంక జైన్, అమర్ దీప్ మధ్య జరిగిన గొడవ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో ఫినాలే టాస్క్‌లు రంజుగా జరుగుతున్నాయి. ఆటల మధ్యలో ఫన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆటల మధ్య విరామం దొరకడంతో బొమ్మ పట్టుకొని ఆట ఆడుతున్న శోభాతో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో అమర్ దీప్ కాలితో తన్నారు. దాంతో ప్రియాంక ఆయనను కొట్టింది. దాంతో గొడవ మొదలైంది.

ప్రియాంక, శోభా శెట్టి కలిసి అమర్ దీప్‌ను కార్నర్ చేసేందుకు ప్రయత్నించడంతో హర్ట్ అయ్యాడు. అక్కడి నుంచి లేచిపోయి వేరే చోటకు వెళ్లిపోయాడు. దాంతో ప్రియాంక జైన్ అసహనం వ్యక్తం చేసింది. నీవు ఏం చేసినా భరించాలి. మేము ఏదైనా అంటే పట్టించుకుంటావా? అని ప్రశ్నించింది. దాంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది.
ప్రియాంక, అమర్ దీప్ మధ్య గొడవలో శోభా శెట్టి జోక్యం చేసుకొంటూ ఫినాలేకి ముందు మన ఇద్దరితో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. అందుకే మనల్ని ఏదో ఒకటి అనే ప్రయత్నం చేస్తున్నారు అని శోభ కామెంట్ చేసింది. దాంతో నువ్వు ఈ విషయానికి మరో రంగు పులిమి టాపిక్ డైవర్ట్ చేయకు అంటూ అమర్ దీప్ అరిచాడు.

అయితే ప్రియాంక, శోభతో మాటలు పెరిగిపోవడంతో అమర్ దీప్ మరింత రెచ్చిపోయాడు. మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ అయ్యాయా? బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేవా అంటూ అమీర్ దీప్ గట్టిగా అరిచాడు. అలా ఒకరిపై మరొకరు గట్టిగా అరుచుకొన్నారు. అమర్ దీప్ వ్యవహారంతో విసిగిపోయిన ప్రియాంక జైన్ మనస్తాపానికి గురైంది.
అమర్ దీప్‌పై ప్రియాంక అసహనం వ్యక్తం చేస్తూ.. నా పాయింట్స్‌ను గౌతమ్ ద్వారా నీకు ఇప్పించడం బుద్ది తక్కువ. అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటూ ఆమె ఘాటుగా స్పందించింది. అయితే ప్రియాంక మాటలపై అమర్ దీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వారి మధ్య కాసేపటికి నార్మల్ స్థితికి రావడం కనిపించింది.


Click it and Unblock the Notifications











