Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో ప్రియాంకకు కాబోయే భర్త.. బయటకు వెళ్లగానే పెళ్లంట, రొమాన్స్ మామూలుగా లేదుగా!
Priyanka Jain Fiance in Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా 10వ వారం హౌస్ లోని కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వస్తుండడంతో.. అంతా తెగ ఎగ్టైజ్ అవుతున్నారు. ఇప్పటికే శివాజి కొడుకు వెంకట్, అశ్విని శ్రీ తల్లి, అలాగే అంబటి అర్జున్ భార్య అంబటి సురేఖలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. దీంతో వారు ఎమోషనల్ అయిన తీరు జరిగిన సంఘటనలతో బిగ్ బాస్ షో ప్రియులంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. వీరే కాకుండా తమకు నచ్చిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చూడాలని కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా బిగ్ బాస్ టీం ఓ ప్రోమోను బయటకు వదిలింది. అందులో ప్రియాంక జైన్ కు కాబోయే భర్త శివ కుమార్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ముందుగా మ్యూజిక్ ప్లే చేయగా... హౌస్ మేట్స్ అంతా డ్యాన్స్ చేసుకుంటూ గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈక్రమంలోనే మెయిన్ గేట్లు ఓపెన్ కాగా.. శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. మొహం చూపించకుండా బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి తన ప్రియుడిని గుర్తించిన ప్రియాంక జైన్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఫుల్ బ్లష్ అవుతూనే.. తన ప్రియుడు, కాబోయే భర్త అయిన శివ కుమార్ ను గట్టిగా హత్తుకుంది. ఇదంతా చూస్తున్న హౌస్ మేట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఈక్రమంలోనే బయట నుంచి రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చిన శివ కుమార్.. ప్రియాంక జైన్ కు ప్రపోజ్ చేశారు.

ఫుల్ ఖుషీ అయిన ప్రియాంక జైన్ ఆయన ప్రేమను యాక్సెప్ట్ చేయగా.. పైకి లేచిన అతను ప్రియాంక నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తనను తన గుండెలకు హత్తుకున్నాడు. అప్పుడే అంబటి అర్జున్ ఏదైనా అడ్డుగా పెట్టనా అంటూ కామెంట్లు చేశాడు. ఇక ఆ తర్వాత బెడ్రూంలో కూర్చుని ప్రియాంక, శివ కుమార్ లు మాట్లాడుకుంటుండగా.. ప్రియాంక ఏడుస్తూ ఎలా ఉన్నావ్ అని అడిగింది. అందుకు శివ కుమార్ బాగున్నానని చెప్పి, నువ్వెలా ఉన్నావని ప్రశ్నించాడు. అందుకు ప్రియాంక ఇంకా ఎక్కువగా ఏడుస్తూ.. నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పింది.

నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యానంటూ మరోసారి తనను దగ్గరకు తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రియాంక.. ప్రియుడిని పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. నువ్వు బయటకు రాగానే చేసుకుందాం అని చెప్పాడు. అందుకు ప్రియాంక మరింత ఎగ్జైట్ అవుతూ.. ఫుల్ బ్లష్ అయిపోయింది. అలాగే ఇప్పుడే చేసుకుందామని చెప్పగా.. శివ కుమార్ మరోసారి దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. ఇక ఆ తర్వాత శోభా శెట్టి వారి దగ్గరకు వచ్చింది. టైమ్ దగ్గర పడుతుందని చెప్పగా.. 5 మినిట్స్ అయినట్లే అనిపిస్తుంది, వారు చెప్పినట్టు అంటూ ప్రియాంక ఫీల్ అయింది.
ఇంతలోనే శోభా శెట్టి ఈరోజు ఉండమని చెప్పొచ్చు.. బిగ్ బాస్ ఈరోజు శివకుమార్ ను ఇక్కడే ఉంచండి అనగా.. శివ కుమార్ అబ్బా అంటాడు. ఇంతలోనే స్పందించిన బిగ్ బాస్.. శివ్ మీరు బిగ్ బాస్ ఇంటిని వీడి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. అదేమీ పట్టించుకోకుండా శివ కుమార్.. ప్రియాంక జైన్ రెండు చెంపలపై ముద్దులు పెట్టాడు. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాక మరోసారి ప్రియాంక మొహంపై ముద్దుల వర్షం కురిపించాడు శివ కుమార్. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అయిపోయింది. పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్పు పూర్తిగా ఏం జరిగిందో తెలియదు. చూడాలి మరి ఏం జరిగిందో.


Click it and Unblock the Notifications











