Bigg Boss Telugu 7: అమర్‌కు ప్రియాంక వెన్నుపోటు.. రేసు నుంచి ఔట్.. ఫినాలే ముందు బిగ్ మైనస్

ఇటీవలి కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. అయితే, వాటిలో చాలా అంటే చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి.

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా దీనికి తెలుగు ప్రేక్షుకులు భారీ స్పందన అందించారు. దీంతో ఇది వరుస సీజన్లతో సందడి చేస్తోంది. ఇప్పుడు జరుగుతోన్న ఏడో సీజన్ కూడా రంజుగా సాగుతోంది. ఇక, ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

Priyanka Jain Gives Shock to Amardeep Chowdary Bigg Boss Telugu 7 Show

ఫినాలే ముందు క్రేజీ టాస్క్: బిగ్ బాస్‌కు సంబంధించి ప్రతి సీజన్‌లోనూ గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతారు. ఇందులో భాగంగా ఏడో సీజన్‌కు సంబంధించి టికెట్ టు ఫినాలే టాస్కును 13వ వారంలో ప్లాన్ చేసి షోను రసవత్తరంగా మార్చేశారు.

మూడు రౌండ్లు.. టాప్‌లోనే: 'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో మూడు టాస్కులు జరిగాయి. ఇందులో అంబటి అర్జున్ రెండు, పల్లవి ప్రశాంత్ ఒక రౌండ్‌లో గెలిచారు. అయినప్పటికీ అమర్‌దీప్ చౌదరికి శివాజి, శోభా శెట్టిలు తమ పాయింట్లను ఇచ్చారు. దీంతో అతడే టాప్‌లో కొనసాగుతున్నాడు. ఫలితంగా టికెట్ టు ఫినాలేను గెలుచుకునేందుకు రెడీ అయిపోతున్నారు.

ఎత్తర జెండా అనే టాస్కు: 'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో 'ఎత్తర జెండా' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఒక దగ్గర ఉన్న ఇసుకను తీసుకు వచ్చి పడవలో పోయాల్సి ఉంటుంది. అలా ఎక్కువ మొత్తంలో పోసి వెనుక వైపు ఉన్న జెండా పైకి లేవాలి. ఈ టాస్కులో అందరి కంటే ముందు పల్లవి ప్రశాంత్ పూర్తి చేసి ఈ టాస్కులో విజేతగా నిలిచాడు.

మెంటల్ టాస్క్‌లో అతడే: 'టికెట్ టు ఫినాలే' టాస్కులో ఐదో రౌండ్‌లో మెంటల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో బిగ్ బాస్ వినిపించే కొన్ని సౌండ్లను కంటెస్టెంట్లు కనిపెట్టాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ విజేతగా నిలిచాడు. చివర్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇలా ఈ ఐదు రౌండ్లు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. ఇవి ముగిసే సమయానికి ప్రియాంక జైన్ చివరి స్థానంలో ఉన్నట్లు బిగ్ బాస్ చెప్పాడు.

సగం పాయింట్లు ఇవ్వాలి: 'టికెట్ టు ఫినాలే' టాస్కులో జరిగిన ఐదు రౌండ్లలో తక్కువ పాయింట్లు తెచ్చుకున్న ప్రియాంక జైన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె సంపాదించిన 250 పాయిట్లలో సగం వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడామె తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అమర్‌దీప్‌కు కాకుండా.. తనను కెప్టెన్ చేసిన గౌతమ్ కృష్ణకు ఇచ్చేసింది.

అమర్‌కు హ్యాండిచ్చేసి: ప్రియాంక జైన్ ఎలాగైనా తనకే పాయింట్లు ఇస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న అమర్‌దీప్‌కు బిగ్ షాక్ తగిలింది. అప్పుడే శోభా శెట్టి వచ్చి 'ప్రియాంక.. గౌతమ్‌కు కుదరకపోయి ఉంటే అర్జున్‌కు పాయింట్లు ఇచ్చేదాన్ని అని చెప్పింది' అని అమర్‌దీప్‌కు చెప్పింది. దీంతో అతడిలో కోపం పెరిగిపోయింది. ఆ వెంటనే ప్రియాంక ముందే తన అసహనాన్ని వెల్లగక్కేసి గొడవ పడ్డాడు.

ఫినాలే ముందు మైనస్: ఫినాలేకు మరో వారం మాత్రమే ఉంది. ఈ వారంలో అమర్‌దీప్ నామినేషన్‌లో లేడు. ఈ సమయంలో అతడి ఫ్యాన్స్ ప్రియాంకకే ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. కానీ, తాజా గొడవ వల్ల ప్రియాంకకు అమర్ ఫ్యాన్స్ నుంచి ఓట్లు తగ్గిపోయినట్లు తెలిసింది. అదే సమయంలో అతడికి సపోర్టు చేసిన శోభా శెట్టికి ఓటింగ్ పెరిగింది. ఫినాలే ముందు ప్రియాంకకు ఇది పెద్ద మైనస్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X