Bigg Boss Telugu 7: ప్రిన్స్ యావర్‌కు బిగ్ షాక్.. ప్లాన్ ప్రకారం ఎలిమినేషన్.. ఇదిగో అసలైన సాక్ష్యం!

ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. ఎక్కడా లేని విధంగా తెలుగులోనే సూపర్ డూపర్ హిట్‌ అయిన షోనే బిగ్ బాస్. ఎంతలా అంటే దేశంలోనే దీనికి టాప్ రేటింగ్ లభిస్తోంది. ఫలితంగా నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఎవరూ ఊహించని అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్‌ను కావాలనే ఎలిమినేట్ చేయాలని స్టార్ మా బ్యాచ్ ప్లాన్ చేసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

కొత్త కాన్సెప్టుతోనే రంజుగా:బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ, ఈ సారి దీన్ని ఇంకాస్త ఎక్కువ సక్సెస్ చేయాలని భావించిన నిర్వహకులు ఉల్టా పుల్టా కాన్సెప్టును తీసుకు వచ్చారు. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని ఎన్నో రకాల అంశాలను హైలైట్ చేస్తున్నారు. ఫలితంగా ఇది విభిన్నంగా సాగుతోంది. దీంతో గతంలో కంటే ఎక్కువ స్పందన కూడా లభించి రేటింగ్ భారీగా వస్తోంది.

Priyanka Jain Help to Shobha Shetty and Cheats Prince Yawar For Secret Task

బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కు:బిగ్ బాస్ ఏడో సీజన్ 12వ వారంలో కెప్టెన్సీ పోటీదారుల కోసం 'బిగ్ బాస్ మ్యాన్షన్' టాస్క్ ఇచ్చారు. ఇందులో ఓ హంతకుడు హత్యలు చేస్తుంటాడు. అతడిని కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులవుతారని చెప్పారు. అంతేకాదు, కంటెస్టెంట్లకు కొన్ని పాత్రలను కూడా ఇచ్చిన విషయం

శివాజికి సీక్రెట్ టాస్కులు:బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో భాగంగా శివాజికి మ్యాన్షన్ మేనేజర్ పాత్రను ఇచ్చిన సంగతి విధితమే. ఇది చెప్పడానికి అతడిని కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. అసలు హంతకుడు మీరే అని చెప్పాడు. అంతేకాదు, మ్యాన్షన్‌లో మిస్సెస్ బిగ్ బాస్‌‌తో పాటు మరిన్ని హత్యలు కూడా చేయాలని చెప్పాడు. అలా ప్రశాంత్, అశ్వినిని శివాజి విజయవంతంగా డెడ్ చేసేశాడు.

Priyanka Jain Help to Shobha Shetty and Cheats Prince Yawar For Secret Task

శివాజి ఫెయిల్.. ఆమెకు:సీక్రెట్ టాస్కులో భాగంగా శివాజికి గౌతమ్‌ కృష్ణను చంపమని, అందుకోసం ఓ స్టిక్కర్‌ను అతడికి అంటించమని బిగ్ బాస్ చెప్పాడు. కానీ, అతడు సరైన సమయానికి చేయలేకపోయాడు. దీంతో ఈ టాస్కులో శివాజి విఫలం అయ్యాడని బిగ్ బాస్ చెప్పాడు. అంతేకాదు, దీన్ని ప్రియాంక జైన్‌కు అప్పగించమని కూడా సూచించాడు. దీంతో సీక్రెట్ టాస్క్ ఆమె చేతిలోకి వెళ్లిపోయింది.

ప్రిన్స్‌ను ఎలిమినేట్ చేసి:శివాజి తనకు టాస్క్ అప్పగించిన వెంటనే ప్రియాంక జైన్.. గౌతమ్ కృష్ణను డెడ్ చేసేసింది. ఆ తర్వాత వాష్‌రూంలోని ఓ హ్యాండ్ వాష్ బాటిల్‌లో టీని నింపాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆమెకు చెప్పాడు. కొద్ది సేపటికి అలా చేసిన ప్రియాంక.. ప్రిన్స్ యావర్‌ను ఔట్ చేయాలన్న ఉద్దేశంతో అతడిని వాష్‌రూంలోకి వెళ్లమని చెప్పింది. దీంతో ఆమె ప్లాన్ తెలియని యావర్ లోపలికెళ్లాడు.

ఆమెకు హెల్ప్ చేసింది:ప్రిన్స్ యావర్‌ను డెడ్ చేసి టాస్కు నుంచి ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేసుకున్న ప్రియాంక జైన్.. ఆ తర్వాత తన స్టార్ మా బ్యాచ్ ఫ్రెండ్ శోభా శెట్టితో 'నువ్వు కామన్ వాష్‌రూం వాడకు. వీఐపీ వాష్‌రూంలోకి వెళ్లు. నేను బిగ్ బాస్‌తో పర్మీషన్ ఇప్పిస్తాను' అని చెప్పి అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత యావర్ టీతో చేతులు కడుక్కుని డెడ్ అయి ఎలిమినేట్ అయిపోయాడు.

సాక్ష్యం ఇదే.. వైరల్‌గా:యావర్‌ను డెడ్ చేయాలని అనుకోవడం ప్రియాంక జైన్ తప్పు కాకపోయినా.. తన స్నేహితురాలైన శోభా శెట్టికి సహాయం చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, ఆమెకు హెల్ప్ చేస్తున్న సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో యావర్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు అంతా ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X