Bigg Boss Telugu 7: ఏంటి ప్రియాంక అంత మాట అనేశావ్.. శివ్ నీకోసం వస్తే అంతలా హర్ట్ చేస్తావా?

Priyanka Huts Shiv: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా పదోవారంలో భాగంగా వస్తున్న ఫ్యామిలీ వీక్ నిజంగా అద్భుతంగా సాగుతోంది. అదిరిపోయే ట్విస్టులతో కుటుంబ సభ్యులను లోపలికి పంపుతున్న బిగ్ బాస్.. అందరిలోనూ ఫుల్ ఉత్సాహం నిండుతోంది. అయితే గత సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్ల పేరెంట్స్... వారికి నచ్చని వారిపై కామెంట్లు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అస్సలే అలా జరగట్లేదు. అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. మిగతా వారితో చాలా కలుపుగోలుగా మాట్లాడడం చాలా బాగా అనిపిస్తుంది. వచ్చిన వారంతా బాగా మాట్లాడుతుంటే కంటెస్టెంట్లే కాస్త అతి చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రియాంక జైన్ కు కాబోయే భర్త శివ కుమార్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడారు. ప్రియాంకకు ప్రేమను పంచుతూనే మిగతా కంటెస్టెంట్లతో కూడా చాలా చక్కగా ఉన్నారు. అయితే ఆయన ఇతరులపై చేసే కామెంట్లు, ప్రేమకు ప్రియాంక కాస్త హర్ట్ అయింది. ముఖ్యం మాడ్చుకొని మరీ శివ కుమార్ ను కూడా హర్ట్ చేసింది. అతను కొట్టిన చిన్న డైలాగ్ లకే ఆమె అంతలా హర్ట్ అవ్వడంతో పాటు రివర్స్ అతడిని కూడా హర్ట్ చేయడం ఫుల్ వైరల్ గా మారింది.

Priyanka Jain Hurts Her Fiance Shiv Kumar in Bigg Boss Telug 7

ఇంతకీ శివ్ ఏమన్నాడంటే?:అశ్వినిశ్రీ గురించి మాట్లాడిన శివ కుమార్.. మీరు చాలా బాగా ఆడుతున్నారని చెప్పాడు. అలాగే అంతకు మించి అందంగా ఉన్నారని పొగిడాడు. జస్ట్ పొగడ్తకే ప్రియాంక మొహం కాస్త మాడిపోయింది. మీరు ఎలా ఆడినా సరే బయట మేము ఉన్నా.. మీ ఫ్యాన్స్ ఉన్నా.. మిమ్మల్ని కాపాడాకుంటాం అశ్వినీ గారూ అని చెప్పారు. నాకోసం వచ్చిన శివ్ ఏంటి అశ్వినీతో ఇలా చెప్పాడు అన్నట్లుగా ప్రియాంక మొహం పెట్టుకుంది. అంతటితో శివ్ ఆపకుండా దీన్ని కొనసాగించాడు.

ముఖ్యంగా రతికా రోజ్ గురించి మాట్లాడుతూ కూడా శివ కుమార్ అలాగే స్పందించాడు. మీరు చాలా బాగున్నారని చెప్పిన అతడు ఆ తర్వాత మమీరు ఆడే గేమ్ బాగుందని అన్నాడు. అలాగే మీరు నవ్వినా, కోప్పడినా, ఏడ్చిలా మీ మొహం రోజ్ లాగే ఎర్రగా అవుతుందని అన్నాడు. అచ్చం మీరు రెడ్ రోజ్ లాగానే ఉన్నారని చెప్పగా.. ప్రియాంక మరింత హర్ట్ అయింది. వెంటనే ప్రియాంక కోసం శివ్ తెచ్చిన గులాబీని తెస్తూ... పో ఇంక ఆమెకే ఇచ్చెయ్ అనింది. దీంతో అంతా షకయ్యారు. కానీ దాన్ని పెద్ద రచ్చ చేస్తే బాగోదని భావించి అక్కడితో క్లోజ్ చేసేశారు.

Priyanka Jain Hurts Her Fiance Shiv Kumar in Bigg Boss Telug 7

కానీ ప్రియాంక ఇలా చేయడంతో శివ కుమార్ చాలా హర్ట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరితోనూ అతడు అంత క్లోజ్ గా, కామెడీగా మాట్లాడలేదు. ముఖ్యంగా ఎలాంటి డైలాగులు కూడా కొట్టలేదు. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఇంత చిన్న విషయానికి అంతలా ప్రియాంక రియాక్ట్ అవ్వడం సరికాదని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వీడియోపై పెద్ద ఎత్తున మీమ్స్ తయారు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X