‘బిగ్‌బాస్‌లో నాతో గొడ్డు చాకిరి... వీక్‌నెస్‌ మీద అలా దెబ్బకొట్టి’

బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యారు బుల్లితెర నటి ప్రియాంక జైన్. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బుల్లితెర నటుడు శివకుమార్‌తో ప్రేమలో పడిన ఈ ముదుగుమ్మ.. గత కొన్నేళ్లుగా ఆయనతో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ జంట సరదా సరదా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కొద్దినెలల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

హౌస్‌లో వంటలక్కలా మిగిలిపోవడం వల్లే టాప్ 1కి చేరుకోలేదా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను బాగానే ఆడాను, నాకు వంట వచ్చు కాబట్టి చేసిపెట్టా. నేను రోటీలు చేస్తున్నా, కానీ ఒక మనిషి 50 రోటీలు చేయడం అంటే మామూలు విషయం కాదు. వచ్చి తినేసి వెళ్లిపోవడమే తప్పించి నేను తిన్నానో లేదో ఎవరూ పట్టించుకోలేదు. గంట గంటన్నర సేపు అక్కడే సరిపోయేది. గౌతమ్ కానీ అమర్ కానీ వాటిని రోస్ట్ చేసేవారు. వాళ్లు కూడా తినాలి కదా? కొంతమంది వచ్చి వాళ్లు తినేసి మళ్లీ రేపు మార్నింగ్ కోసం కూడా దాచుకునేవాళ్లు. అలా రెండు నెలలు జరిగింది. ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీగారు ఇలాగే చేసేవారు. కొన్నిసార్లు చేయలేక అలిసిపోయి.. రేపు మార్నింగ్ కోసం దాచుకోవద్దని, కావాలంటే మళ్లీ వండుకుందామని చెప్పేదానిని. కానీ ఈ చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూపించేశారు. 20 రోజులు కష్టపడిన దానిని మరిచిపోయారు.. 2 రోజులు వద్దన్న దానిని హైలైట్ చేశారు. ఒక సందర్భంలో నేను ఏడ్చాను కూడా అని ప్రియాంక జైన్ గుర్తుచేసుకున్నారు.

Priyanka Jain Opens Up About Her Struggles Shivaji Comments and Game Strategy in Bigg Boss

తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేవాలి.. ఆ టైంలో మాకు తినడానికి ఏం ఉండదు. పులిహోర ప్యాకెట్స్ వస్తాయి.. వాటిని రైస్‌లో కలిపి తినేసేవాళ్లం. కానీ అప్పుడు కడుపులో బాగుండేది కాదు.. దాంతో నేను కొన్ని రోటీలు దాచిపెట్టుకునే దానిని. వాటిని హైలైట్ చేశారు కానీ.. నేను చెప్పినవాటిని మాత్రం ఎక్కడా పెట్టలేదు... ఒకవేళ చూపించి ఉంటే నేనే గెలిచేదానినేమో. కానీ బిగ్‌బాస్‌లో 100 శాతం ఇచ్చా.. అయితే అంతిమ నిర్ణయం ప్రేక్షకులదే. ఫ్రెండ్‌షిప్ వల్ల నా గేమ్ కొంత దెబ్బతిన్నది.. స్ట్రాటజిక్‌గా ఆడుంటే నేను టాప్‌లో ఉండేదానినేమో అని ప్రియాంక తెలిపారు.

బిగ్‌బాస్‌లో హౌస్‌లో నేను చేయని పనికి నా మీద నిందలు వేస్తే మూడు సార్లు నాగార్జున గారితో వాదించా. శివాజీగారితో క్లోజ్ అవ్వాలని ట్రై చేశాను కానీ ఆయనే నన్ను దూరం పెట్టారు. శివాజీగారు మాస్టర్‌మైండ్.. మాస్టర్ మైండ్స్‌ ముసుగు వేసుకునే ఉంటారు, ఆయన ఒరిజినల్ ఏంటీ అనేది ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు. ఎవరికైనా నేను సపోర్ట్ చేశాను కానీ.. నేను మాత్రం ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. సెలబ్రిటీలు, వీడియో బైట్స్, అభిమానుల సాయం తీసుకోకుండా ఆడటం గర్వంగా ఉంది. ఎవరైనా కొంచెం ఎమోషనలైతే నేను కరిగిపోతా అదే నా వీక్‌నెస్ అని ప్రియాంక జైన్ అన్నారు.

నా చిన్నప్పుడు ఫస్ట్ చూసిన డబ్బింగ్ మూవీ మాస్. లాస్ట్ సీజన్‌లో నేను కీర్తికి సపోర్ట్ చేయడానికి వెళ్లాను, ఆ సమయంలో నాగార్జున సర్ పక్కనే ఉండటం మరిచిపోలేని అనుభూతి. అప్పుడు నా పేరు ఆయనకు తెలియదు.. కానీ ఇప్పుడు నన్ను ప్రియాంక జైన్ అని గుర్తుపడతారు. అంతపెద్ద వ్యక్తి ముందు నేను అన్ని రోజులు ఉండటం మరిచిపోలేం. నాగ్ సార్ ఇచ్చిన సలహాలను పాటించి ఆడానని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక జైన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X