Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడట.. నాగ్ ముందు నిజం చెప్పేసిన ప్రియాంక!

బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతంగా సాగుతోంది. రోజురోజుకూ మరి రసవత్తరంగా మారుతున్న షో ను చూసే బుల్లితెర ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. నామినేషన్లు, వీకెండ్ ఎపిసోడ్ లు చూసే వాళ్లు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆరోజుల్లోనే ఎక్కువగా అప్ డేట్లు తెలుస్తుండడంతో చాలా మంది వీటిని మాత్రమే చూస్తుంటారు. అయితే తాజాగా 13వ వారానికి సంబంధించిన వీకెండ్ ఎపిసోడ్స్ రానే వచ్చాయి. రేపే ఇంట్లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ముఖ్యంగా ఈరోజు నాగార్జున హౌస్ మేట్స్ లో తప్పు చేసిన వారిపై పైర్ అవడం కన్ఫార్మ్.

అయితే తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే నాగార్జున డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా అమర్ దీప్ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా టికెట్ టు ఫినాలే టాస్క్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ గా మారిన అంబటి అర్జున్ కు నాగార్జున కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఎవరి సాయం లేకుండా అన్ని గేమ్స్ తనంతట తానుగా ఆడి ఫినాలే అస్త్రను గెలుచుకోవడంతో ఆయన గ్రాఫ్ పెరిగిపోయింది. ఇదంతా చూస్తుంటనే ఆయన ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారని అనిపిస్తోంది.

Priyanka Jain Says That Amardeep Did Emotional Blackmail in Bigg Boss Telugu 7

అయితే ముందుగా శోభాశెట్టిని లేపిన నాగార్జున నువ్వు గేమ్ ఎలా ఆడావు అంటే 200 పర్సంట్ ఇచ్చాను సార్ అని శోభా చెబుతుంది. మరి 90 పాయింట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా... మొహం కిందకు వేసేసింది. ఇక ఆ తర్వాత శివాజిని లేపిన నాగార్జున నువ్వు గేమ్ ఎలా ఆడాననుకుంటున్నావు అని అడిగాడు. అందుకు శివాజి బాగానే ఆడాను కానీ... చేయి నొప్పి విపరీతంగా ఎక్కువైందని చెప్పాడు. మీ ఇద్దరూ కలిసి అమర్ దీప్ కు పాయింట్లు ఇచ్చారు కదా.. ఇష్టంగానే ఇచ్చారా.. అమర్ ఏడుస్తాడని ఇచ్చారా అంటూ నాగ్ కామెడీ చేశాడు. అదేం లేదు సార్ మేము మాట్లాడుకొనే ఇచ్చామని చెబుతూనే శివాజి ఫుల్లుగా నవ్వాడు.

ఇక ఆ తర్వాత శోభాశెట్టి అమర్ నా దగ్గర అలగడు సార్ అంటూ చెప్పగా... నువ్వు చెప్పమ్మా ప్రియాంక... అమర్ అలుగుతాడా లేదా అని నాగార్జున అడిగాడు. వద్దు సార్ ఈ వారం అంతా అదే సాగింది అంటూ ప్రియాంక జైన్ చెప్పుకొచ్చింది. నువ్వు గౌతమ్ కు ఇష్టంగానే పాయింట్లు ఇచ్చావా అని అడగ్గా గ్రాటిట్యూడ్ సార్ అంటా సమాధానం చెప్పింది. మరి ఆ తర్వాత అమర్ దీప్ కే పాయింట్లు ఇవ్వమని గౌతమ్ కు ఎందుకు చెప్పావని ప్రశ్నించాడు. దానికి ప్రియాంక నా మైండ్ లో ఇద్దరూ ఉన్నారు సార్ అని చెప్పింది.

Priyanka Jain Says That Amardeep Did Emotional Blackmail in Bigg Boss Telugu 7

అంతలోనే నాగార్జున అందుకొని అమర్ దీప్ నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడా అని ప్రశ్నించాడు. అవున సార్ ఇది మాత్రం వాస్తవం. అమర్ దీప్ నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని అనగా... అమర్ దీప్ మొహం వాడిపోయింది. నువ్వు అసల్ పాయింట్లు ఎందుకు ఇచ్చావో ఇప్పటికీ శోభాకు అర్థమే కాలేదు అనగా... అర్థం అయ్యే వాళ్లకు అర్థం అయితే చాలంటూ స్పష్టం చేసింది. ఇలా ఈరోజుటి ఫస్ట్ ప్రోమో పూర్తి అయింది. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X