Priyanka Jain: ప్రియుడితో ప్రియాంక బైన్ బ్రేకప్ ? నేను సోలో అంటూ శివ షాక్..!
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain) పేరు టెలివిజన్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కన్నడకు చెందిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకుంది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక, అక్కడ కూడా తన స్ట్రాంగ్ పర్సనాలిటీతో మాస్ క్రేజ్ సంపాదించింది. రియాలిటీ షో తర్వాత ఆమె బిజీగా మారి పలు టీవీ షోలు, ఈవెంట్స్‌లో పాల్గొంటుంది.
ఇలా తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితం కూడా హాట్ టాపికే.. ఈ అమ్మడు గత కొన్ని రోజులు బుల్లితెర నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉందనే విషయం అభిమానులకు తెలుసు. చాలాకాలంగా ఇద్దరూ కలిసి ఉంటూ తమ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడూ తమ పర్సనల్ అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్‌లో "గోల్స్ కపుల్"గా పేరుతెచ్చుకున్నారు. అయితే.. తాజాగా ప్రియాంక తన ప్రియుడి శివ కుమార్ తో బ్రేకప్ అయింది.. ఆ విషయం మీకు తెలియదా? అంటూ షాకిచ్చింది. నటుడు శివ కుమార్ కూడా నేను సోలో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇదిలా ఉంటే.. స్టార్ మా ప్రసారం అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గేమ్ షో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' తాజా ఎపిసోడ్‌లో బుల్లితెర హాట్ జంట ప్రియాంక జైన్-శివకుమార్ సందడి చేశారు. యాంకర్ శ్రీముఖి తన స్టైల్‌లో షోను నడిపిస్తుండగా, సహ యాంకర్‌గా ముక్కు అవినాష్ కామెడీతో అలరిస్తారు. తాజా ఎపిసోడ్ కాన్సెప్ట్ "హీరోస్ vs హీరోయిన్స్", అంటే మెయిల్ సెలెబ్రిటీలు vs లేడీ సెలెబ్రిటీలు మధ్య ఫన్ పోటీ. ఎపిసోడ్ ప్రారంభం నుంచే రెండు టీమ్స్ ఫుల్ జోష్‌లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, సింగింగ్‌తో ప్రేక్షకులను అలరించాయి. బిగ్ బాస్ కాంటెస్టెంట్లు, పాపులర్ సీరియల్ నటీనటులు పాల్గొనడంతో షోకి స్టార్డమ్ డబుల్ అందించారు.
ఎపిసోడ్ థీమ్‌ని అవినాష్ పరిచయం చేస్తూ.. "మన సీరియల్ పూరంలో విగ్రహం కడదాం" అని జోక్ వేయడంతో, శ్రీముఖి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ముందు బుల్లితెర నటుడు అర్జున్ దగ్గరికి వెళ్లి.. "ఇతనికి విగ్రహం కట్టే డబ్బులతో నేను 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటా" అంటూ కామెడీ బాంబ్ వేస్తాడు. తరువాత యాక్ట్రెస్ సుహాసినిని టార్గెట్ చేస్తూ శ్రీముఖి "నీకు విగ్రహం పెడితే నడుము ఉండదు" అంటూ సరదాగా అడగగా, ఆమె కూడా "మా విగ్రహం కడితే ఎంత ప్రయోజనం ఉంటుంది చూశావా?" అంటూ పంచ్ వేసింది.
ఆ తర్వాత అవినాష్.. శివకుమార్‌ను ఉద్దేశించి "నీ విగ్రహం కడితే పక్కనే ప్రియాంకది కూడా పెట్టాలి కాదు?" అని ప్రశ్నించగా, శివకుమార్ వెంటనే "వద్దు... నేను సోలోనే... ఇప్పుడూ" అంటూ షాకింగ్ సమాధానం ఇస్తాడు. దీంతో శ్రీముఖి, అవినాష్ ఇద్దరూ షాకయ్యి.. "శివ చెప్పాడు... బ్రేకప్ అయిందంటున్నాడు... నిజమేనా?" అని ప్రియాంకని అడగగా, ఆమె కూడా "అవును... తెలియదా?" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. అవినాష్ కంగారు పడుతూ "మాకు చెప్పలేదు ఎందుకు?" అని మళ్లీ ప్రశ్నించగా.. ప్రియాంక శివ వైపు చూసి "ఇక్కడే ఉన్నావుగా!" అంటూ లాగేసుకుంటుంది. దీంతో షోలో నవ్వుల పూవ్వులు పూశాయి.
ప్రియాంక రియాక్షన్‌ని సాఫ్ట్ చేసే ప్రయత్నంగా శివకుమార్ మరో సెటైర్ వేశాడు. " ప్రియాంక విగ్రహం సిమెంట్‌తో కాదు... గోల్డ్‌తో కట్టాలి" అన్నాడు. ఈ మాట వినగానే శ్రీముఖి షాక్ అవుతుంది. ఆ సెటైర్ షోలో హైలైట్ గా మారింది. ఇలా షో మొత్తం సరదా వాతావరణంలో సాగింది. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైన వెంటనే నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రియాంక-శివకుమార్ జంట మధ్య వచ్చే ప్రతి సన్నివేశం, కామెడీ పంచ్‌లు, మిస్ టైమింగ్‌లతో ఫ్యాన్స్ బోలెడంత ఫన్ జనరేట్ చేసింది. అయితే.. ’’ఇది అంతా స్క్రిప్టెడ్ ఫన్ మాత్రమే... TRP కోసం ఎంటర్టైన్‌మెంట్" అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











